Ross Taylor : మ్యాచ్‌లో డ‌కౌట్.. రాస్ టేల‌ర్ మొహంపై కొట్టిన రాజ‌స్థాన్ ఓన‌ర్

NQ Staff - August 14, 2022 / 08:25 PM IST

Ross Taylor : మ్యాచ్‌లో డ‌కౌట్.. రాస్ టేల‌ర్ మొహంపై కొట్టిన రాజ‌స్థాన్ ఓన‌ర్

Ross Taylor : కొద్ది రోజుల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన రాస్ టేల‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్‌లోని చీకటి కోణాన్ని తన ఆత్మకథ ద్వారా బయటపెట్టిన ఆ జట్టు మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. ఐపీఎల్ గురించి కూడా ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు. 2011 ఐపీఎల్ మెగా వేలంలో తనను రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని పేర్కొన్న రాస్ టేలర్.. ఓ మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు ఆ జట్టు ఓనర్ తన చెంపపై కొట్టాడని ప్రస్తావించాడు.

టేల‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..

 Ross Taylor Farewell To International Cricket

Ross Taylor Farewell To International Cricket

కొద్దికాలం క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కివీస్ దిగ్గజం ఇటీవలే తాను రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ లో కనిపించేదంత నిజం కాదని అక్కడ కూడా వివక్ష సర్వ సాధారణమని, అందుకు తానే ఒక ఉదాహరణ అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని రాస్ టేలర్ ఈ బుక్‌లో పేర్కొన్నాడు.

భారీ ధర దక్కినప్పుడు సహజంగానే మన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఆసక్తి కనబరుస్తాం. అదేవిధంగా మనపై భారీగా ఖర్చుపెట్టిన జట్టు సైతం అదే స్థాయిలో ప్రదర్శనను ఆశిస్తోంది. మన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనా అండగా ఉంటారు. కానీ కొత్త టీమ్ అయితే పక్కనపెట్టేస్తారు. 2011 ఐపీఎల్ సీజన్‌లోనే నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో మేం 195 పరుగులు చేదించలేకపోయాం.

ఆ మ్యాచ్‌లో నేను ఎల్బీడబ్ల్యూగా డకౌటయ్యాను. కనీస పోరాటం లేకుండా చిత్తుగా ఓడాం. ఆ మ్యాచ్ అనంతరం హోటల్ బార్‌లో టీమ్ పార్టీ జరిగింది. అక్కడికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఓనర్స్ కూడా వచ్చారు. రాజస్థాన్ రాయల్స్‌‌ ఓనర్ నాతో మాట్లాడుతూ..‘డకౌట్ అయ్యేందుకు 1 మిలియన్ డాలర్లు చెల్లించడంలేదని నా చెంపపై రెండు మూడు దెబ్బలు వేసాడు. మెళ్లిగానే నవ్వుతూనే కొట్టాడు. కానీ నేను మాత్రం సరదాగా తీసుకోలేకపోయాను. ప్రొఫెషనల్ లీగ్‌ల్లో ఇలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాను. ఏ మాత్రం ఊహించలేకపోయాను’అని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us