Rohit Sharma : పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజాంకి పెళ్ళి సలహా ఇచ్చిన రోహిత్ శర్మ.!

NQ Staff - August 28, 2022 / 12:16 PM IST

155496Rohit Sharma : పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజాంకి పెళ్ళి సలహా ఇచ్చిన రోహిత్ శర్మ.!

Rohit Sharma : భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఎక్కడ జరిగినా అది హై ఓల్టేజ్ ఎంటర్టైనర్‌లా మారిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తుంటుంది. ‘దాయాదుల పోరు’గా ఈ పోటీని అభివర్ణిస్తుంటాం. ప్రపంచ క్రికెట్‌లో ఏ రెండు జట్ల మధ్యా ఈ స్థాయి భావోద్వేగాలతో కూడిన మ్యాచ్ వుండదేమో.!

Rohit Sharma gave marriage advice to Pakistan cricket captain Babar Ajan

Rohit Sharma gave marriage advice to Pakistan cricket captain Babar Ajan

చాలా అరుదుగా మాత్రమే టీమిండియా – పాకిస్తాన్ జట్లు మైదానంలో తలపడుతున్నాయి.. దానిక్కారణం, భారత్ – పాక్ దేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న ఉద్రిక్త పరిస్థితులే. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదన్న వాదన వున్నా, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్‌తో క్రీడలేంటి.? అన్న వాదనా లేకపోలేదు.

భావోద్వేగాలు.. ఎంటర్టైన్మెంట్..

మైదానంలో అగ్రెసివ్ నేచర్.. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తత.. ఇవన్నీ పక్కన పెడితే, తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకీ, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాంకీ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. అది కూడా పెళ్ళికి సంబంధించిన టాపిక్ మీద కావడం గమనార్హం.

‘పెళ్ళి చేసుకో బాబర్..’ అని రోహిత్ శర్మ చెబితే, ‘ఇప్పడే వద్దు భయ్యా..’ అని బాబర్ బదులిచ్చాడు. ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. కాగా, ఆసియా కప్ పోటీల్లో భాగంగా టీమిండియా – పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.