Ravindra Jadeja : రవీంద్ర జడేజాకి గాయం.! అసలు నిజం తెలిస్తే షాకవుతారు.!
NQ Staff - September 10, 2022 / 10:17 AM IST

Ravindra Jadeja : టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా, ఆసియా కప్ టీ20 టోర్నీకి దూరంగా వున్న విషయం విదితమే. మంచి ఫామ్‌లో వున్న జడేజా ఎందుకు జట్టుతో కలవడంలేదు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత చిన్నగాయమేనని జట్టు యాజమాన్యం చెబుతూ వచ్చింది.
కానీ, రవీంద్ర జడేజా గాయానికి వెనుక పెద్ద కథే నడిచిందట. దుబాయ్‌లో ఓ హోటల్‌లో టీమిండియా సభ్యులు బస చేయగా, అక్కడ ఓ వాటర్ బేస్డ్ యాక్టివిటీలో పాల్గొనాల్సిందిగా రవీంద్ర జడేజాకి సూచించిందట భారత క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్. ఆ యాక్టివిటీ చేస్తున్న సమయంలో స్కై బోర్డుని బ్యాలెన్స్ చేస్తూ.. దురదృష్టవశాత్తూ అదుపు తప్పి కింద పడిపోయాడట.
గాయం మరీ అంత తీవ్రమైనదా.?

Ravindra Jadeja Was Injured Balancing Sky Board
తొలుత చిన్న గాయమేనని ప్రచారం ఎందుకు చేశారు.? ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సింత పెద్ద గాయాన్ని చిన్నదిగా చూపేందుకు ఎవరు ప్రయత్నించారు.? అన్నది తేలాల్సి వుంది.
కీలకమైన ఆటగాళ్ళ భద్రత విషయమై జట్టు మేనేజిమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ దుస్థితి అన్నది మెజార్టీ వాదనగా కనిపిస్తోంది. జడేజా జట్టుకి అందుబాటులో లేకపోవడం.. ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడటం తెలిసిన విషయాలే.
తెరవెనుకాల ఇంత పెద్ద కథ నడిస్తే, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎందుకు తీవ్రంగా స్పందించలేదు.? అన్నదీ చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పిదం జరిగినా, ద్రావిడ్ తీవ్రంగా స్పందిస్తాడు. కానీ, ద్రావిడ్ ఈ విషయంలో మౌనంగా వున్నాడు. ఏదో అనవసర ప్రయోగం చేసి, జట్టు యాజమాన్యం బోల్తా కొట్టిందనేది సుస్పష్టమవుతోందిక్కడ.