Rabin Utappa : అంతర్జాతీయ క్రికెట్‌కి రాబిన్ ఊతప్ప గుడ్ బై.!

NQ Staff - September 15, 2022 / 08:41 AM IST

158675Rabin Utappa : అంతర్జాతీయ క్రికెట్‌కి రాబిన్ ఊతప్ప గుడ్ బై.!

Rabin Utappa : ఈయనా ధోనీ బాధితుడే.! ప్రత్యక్షంగా కాకపోయినా, టీమిండియాలో చాలామంది ధోనీ బాధితులున్నారు. పార్థీవ్ పటేల్, దినేష్ కార్తీక్, రాబిన్ ఊతప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. రాబిన్ ఊతప్ప.. స్టన్నింగ్ క్రికెటర్. బెరుకు లేని బ్యాట్స్‌మెన్. తాజాగా రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.

Rabin Utappa Retired International Cricket

Rabin Utappa Retired International Cricket

టీ20ల్లో రాబిన్ ఊతప్ప ఓ రేంజ్‌లో సత్తా చాటాడు. వన్డేల్లోనూ దుమ్మరేపాడు. అయితే, అనూహ్యంగా టీమిండియాకి దూరమవుతూ వచ్చాడు. టీమిండియాలో రాబిన్ ఊతప్ప తన స్టామినాకి తగ్గ స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోవడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ.!

వికెట్ కీపింగ్.. బలం, బలహీనత.! రాబిన్ ఊతప్ప వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ఈ కోవలోనే పార్తీవ్ పటేల్, దినేష్ కార్తీక్ కూడా జట్టులో అవకాశాలు పొందడంలో విఫలమయ్యారు.. ఎందుకంటే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోటాలో మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సయిపోవడంతో.

రాబిన్ ఊతప్ప టీమీడియా తరఫున కేవలం 12 టీ ట్వంటీ మ్యాచ్‌లు, 46 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఇప్పటిదాకా 205 మ్యాచ్‌లు ఆడాడు రాబిన్ ఊతప్ప. వికెట్ కీపింగ్ అవకాశం దక్కని సమయంలో కేవలం బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి, మైదానంలో మెరు ఫీల్డింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి ఆటగాడిగా దూరమైనా, కొత్త రూపంలో క్రికెట్‌కి దగ్గరగానే వుంటానని అంటున్నాడు రాబిన్ ఊతప్ప.