IPL : మ‌న ఐపీఎల్ మీద పాకిస్థాన్ అక్కసు.. చాడీలు చెప్పడానికి రెడీ అయింద‌ట..!

NQ Staff - June 18, 2022 / 06:46 PM IST

IPL : మ‌న ఐపీఎల్ మీద పాకిస్థాన్ అక్కసు.. చాడీలు చెప్పడానికి రెడీ అయింద‌ట..!

 

IPL : క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా ఒక మతంగా భావించే దేశం మనది. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద స్టార్ల దగ్గరి నుండి చిన్న పిల్లాడి వరకు అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ ఇండియాలో అంతకంతకు పాపులర్ అవుతూనే ఉంది. అదే సమయంలో బీసీసీఐ క్రికెట్ కు కొత్త రూపు తెచ్చిపెట్టింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా క్రికెట్ కు పూర్తిస్థాయి కమర్షియల్ హంగులను అద్దడంతో పాటు ఎవరూ ఊహించలేని స్థాయిలో అట్టహాసంగా నిర్వహిస్తోంది.

 

ఐపీఎల్ లో ఆడటానికి ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చెందిన క్రికెటర్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఇండియాలో జరిగే ఐపీఎల్ లో ఆడటం అంటే కాసులకు కాసులతో పాటు గుర్తింపు లభిస్తుందనే భావన ఎంతోమంది క్రికెటర్లలో ఉంది. దేశంలో జరిగే ఐపీఎల్ కు అంతకంతకు ఆదరణ పెరుగుతుండగా.. దీనిని చూసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తట్టుకోలేకపోతోంది. దీంతో ఇండియాలో జరిగే ఐపీఎల్ మీద అక్కసు వెల్లగక్కుతోంది.

 

ఇంతకీ పాకిస్థాన్ ఇబ్బంది ఏంటి?

India vs Pakistan T20 cricket match record

ఇండియాలో జరిగే ఐపీఎల్ లో పాకిస్థాన్ కు చెందిన క్రికెటర్లకు చోటులేదు. ముంబై దాడి జరిగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోగా.. దీంతో రగిలిపోతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐపీఎల్ మీద అక్కసు వెళ్లగక్కడానికి సిద్ధమైపోయింది. అంతకుముందు బీసీసీఐ కార్యదర్శి షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి ఐపీఎల్ గురించి చాడీలు చెప్పడానికి సిద్ధమైంది. బీసీసీఐ కార్యదర్శి షా మాట్లాడుతూ.. ‘వచ్చే FTP షెడ్యూల్ నుంచి ఐపీఎల్ కు రెండున్నర నెలల టైం ఉంటుంది. దీంతో, అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడవచ్చు. దీని గురించి మేం ఇతర బోర్డులు మరియు ఐసీసీతో చర్చించాం’ అని వ్యాఖ్యానించాడు.

 

FTP అంటే ఫ్యూచర్ టూర్ ప్లాన్. అంటే ఏ దేశం, ఏ దేశం టీంతో మ్యాచులు ఆడాలనే ప్లాన్. మామూలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ (ఐసీసీ) దీనిని ప్లాన్ చేస్తుంది. అయితే ఇండియాలో ఐపీఎల్ జరిగే నేపథ్యంలో రెండు నెలల పాటు టైం ఇస్తే.. అన్ని దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడతారు. ఇక్కడే పాకిస్థాన్ కు కడుపు మండింది. దీంతో ఐపీఎల్ మీద ఐసీసీ సానుకూలంగా ఉండటాన్ని తట్టుకోలేక, దానిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us