Sunil Gavaskar :క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కామెంట్రీ బాక్స్‌లో ఒక్కోసారి సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2022కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. కామెంట్రీ బాక్స్‌లో నోరుజారాడు. రాజస్థాన్ రాయల్స్ పవర్ హిట్టర్ సిమ్రాన్ హెట్‌మెయర్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
151 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ 14.5 ఓవర్లు ముగిసే సమయానికి 104/4తో నిలిచింది. ఈ దశలో సిమ్రాన్ హెట్‌మెయర్ క్రీజులోకి వెళ్లగా.. డెలివరీ అనే పదాన్ని వాడుతూ రాజస్థాన్‌ని అతను గెలిపించగలడా? అంటూ మాట్లాడిన సునీల్ గవాస్కర్ నోరుజారాడు. ఈక్రమంలో హెట్‌మెయర్ భార్య ఇటీవల డెలివరీ అయిన విషయాన్ని కూడా గవాస్కర్ ప్రస్తావించాడు. దాంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు.
తన భార్య ప్రస్తావన సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఇటీవల వెస్టిండీస్‌కి వెళ్లిన హెట్‌మెయర్.. ఈ మ్యాచ్‌కి రెండు రోజుల ముందే భారత్‌కి వచ్చాడు.ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ అలాంటి కామెంట్స్ చేశాడు. అయితే అతని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఊహించని విజయంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 151 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఛేదించేసిన రాజస్థాన్ రాయల్స్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి లీగ్ దశని ముగించింది. ఈ మ్యాచ్‌లో బంతితోనే కాదు.. బ్యాట్‌తోనూ సత్తాచాటిన అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుని గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుని అందుకున్నాడు.
- Advertisement -
చెన్నై టీమ్ బౌలర్లపై అనూహ్యంగా అశ్విన్ (40 నాటౌట్: 23 బంతుల్లో 2×4, 3×6) ఎదురుదాడి చేశాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ 96 మీటర్ల సిక్స్ కొట్టిన అశ్విన్.. ఆ తర్వాత సోలంకి కూడా డీప్ మిడ్ వికెట్ దిశగా ఓ భారీ సిక్స్ కొట్టాడు. అనంతరం ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ముకేష్ చౌదరికి కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అశ్విన్ హిట్టింగ్‌ని ఊహించలేకపోయిన చెన్నై బౌలర్లు తలపట్టుకున్నారు.