Mr IPL Suresh Raina : రైనా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

NQ Staff - March 20, 2022 / 12:59 PM IST

Mr IPL Suresh Raina  : రైనా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

Mr IPLSuresh Raina : ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో అతడు అన్ సోల్డ్ ఆటగాళ్ల కేటగిరీలో నిలిచిపోయాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సురేష్ రైనాను ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైనా అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. మిస్టర్ ఐపీఎల్ ను కొనుగోలు చేయకపోవడమేంటని వారు తమ బాధను వ్యక్తం చేశారు.

ఇలా రైనా అభిమానులు బాధపడుతున్న తరుణంలో మిస్టర్ ఐపీఎల్ రైనా ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అందింది. ప్రపంచంలో చాలా చిన్న దేశంగా పేరున్న మాల్దీవ్స్ అందించే ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్ పోవెల్, డచ్ ఫుట్ బాల్ ఆటగాడు ఎడ్గర్ డెవిడ్స్ సహా మొత్తం 16 మంది స్పోర్ట్స్ పర్సన్స్ పోటీ పడ్డారు.

Mr IPL Suresh Raina Fans have Heard Some Good News

Mr IPL Suresh Raina Fans have Heard Some Good News

కానీ ఈ అవార్డు మాత్రం మిస్టర్ ఐపీఎల్ రైనానే వరించింది. ఐపీఎల్ మెగా వేలంలో ఏ ప్రాంచైజీ తమ అభిమాన ఆటగాడిని కొనుగోలు చేయలేదని బాధపడుతున్న రైనా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడా మంత్రి జహీన్ హసెన్ రసెల్ మిస్టర్ ఐపీఎల్ రైనాకు అందజేశాడు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవ్స్ క్రీడా మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రైనా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైనా ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుని బ్యాన్ చేసిన రెండు సంవత్సరాల కాలం పాటు అతడు కొత్తగా వచ్చిన గుజరాత్ ప్రాంచైజీకి ఆడాడు. కానీ మరలా చెన్నై జట్టు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రైనా ఆ జట్టుకే సేవలందిస్తున్నాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us