Mithali Raj : టీ20 వరల్డ్ కప్‌పై మిథాలీ జోస్యం : టీమిండియా ‘ఫైనల్’ ప్రత్యర్థి ఎవరంటే.!

NQ Staff - November 2, 2022 / 08:35 AM IST

Mithali Raj : టీ20 వరల్డ్ కప్‌పై మిథాలీ జోస్యం : టీమిండియా ‘ఫైనల్’ ప్రత్యర్థి ఎవరంటే.!

Mithali Raj : టీ20 వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా ఫైనల్‌కి చేరడం ఖాయమని అంటోంది మహిళా టీమిండియా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. కొన్నాళ్ళ క్రితమే మిథాలీ రాజ్, క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విషయం విదితమే.

తాజాగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ, టీమిండియా ఫైనల్‌లో బలమైన అభ్యర్థితో తలపడబోతోందంటూ జోస్యం చెప్పడం గమనార్హం. ఆ బలమైన ప్రత్యర్థి ఎవరో కాదు న్యూజిలాండ్ అట.

మిథాలీ అంచనాలిలా వున్నాయ్…

మిథాలీ అంచనాల ప్రకారం సోమీ ఫైనల్స్‌కి చేరబోయే జట్లలో గ్రూప్-2 నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా వుంటాయట. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ ఖచ్చితంగా వుంటుందనీ, మరో స్థానం కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పోటీ పడతాయని చెప్పింది మిథాలీ రాజ్.

ఇదిలా వుంటే, ఇంగ్లాండ్ చేతిలో తాజాగా న్యూజిలాండ్ ఓడిపోయింది. న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ పసికూన ఐర్లాండ్ కావడంతో, ఆ జట్టుపై విజయం న్యూజిలాండ్‌కి పెద్ద కష్టమేమీ కాదు. ఇక, ఇంగ్లాండ్ – శ్రీలంక మీద గెలవాల్సి వుంటుంది. ఆస్ట్రేలియా – ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో ఎలాగూ ఆస్ట్రేలియాదే పై చేయి అవ్వొచ్చు.

మూడు ప్రధాన జట్లూ తమ చివరి మ్యాచ్‌లలో గెలిస్తే మళ్ళీ అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us