Mahendra Singh Dhoni And Hardik Pandya : పార్టీలో డాన్సులేసిన ధోనీ, హార్దిక్ పాండ్యా.! వీడియో వైరల్.!
NQ Staff - November 28, 2022 / 04:54 PM IST

Mahendra Singh Dhoni And Hardik Pandya : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, ఎంటర్టైన్మెంట్ వేదికలపై చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాక మాత్రం, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టేశాడు. ధోనీ నిర్మాతగా మారి, తమిళంలో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అసలు విషయంలోకి వస్తే, మహేంద్ర సింగ్ ధోనీ ఓ పార్టీలో బీభత్సంగా డాన్సులేసేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీతోపాటు, టీమిండియా సెన్సేషనల్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా వున్నాడు.
పార్టీ ఎక్కడ జరిగిందబ్బా.?
ఈ పార్టీ దుబాయ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు పార్టీలో ధోనీ, హార్దిక్ ఇలా సందడి చేశారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
ధోనీకి నిఖార్సయిన శిష్యుడిగా హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకోవచ్చు. ధోనీ.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయితే, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్.. అంతే తేడా.. మ్యాచ్‌ని ఫినిష్ చేయాలంటే.. ఇద్దరూ ఇద్దరే.!
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ధోనీ, హార్దిక్ పాండ్యా.. ఇద్దరూ ప్రొఫెసనల్ డాన్సర్లలా పార్టీలో చెలరేగిపోయారంతే.!
MS Dhoni and Hardik Pandya enjoying a party in Dubai. pic.twitter.com/J9qOJKw4zE
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2022