Venu Swamy : దేశాలు దాటేసిన వేణు స్వామి జ్యోతిష్యం.! విదేశీ స్టార్ క్రికెటర్‌కి జాతకం చెబుతూ.!
NQ Staff - October 26, 2022 / 02:33 PM IST

Venu Swamy : వేణుస్వామి అంటే చాలు.. ఆయనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతలా ఆయన పేరు పాపులర్ మరి. సినీ స్టార్స్‌కి భవిష్యత్తు గురించి చెబుతూ, తెగ ఫేమస్ అయిపోయారీ జ్యోతిష్య పండితులు వేణుస్వామి.
ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల నేపథ్యంలో వేణు స్వామి పేరు మరింత పాపులర్ అయ్యింది. వాళ్ల విడాకుల విషయాన్ని ఆయన ముందే పసిగట్టేశారట. సమంత, చైతూ విడాకులే కాదు, మరో సెన్సేషనల్ సినీ కపుల్ నయన తార, విఘ్నేష్ శివన్ విషయంలోనూ ఈయన పేరు వినిపించింది.
కివీస్ ఆటగాడికి జాతకం చెబుతూ వేణుస్వామి..
నయన్‌కి పెళ్లి కలిసి రాదని చెప్పారట. అందుకే ఇన్నాళ్లూ నయన్ పెళ్లి చేసుకోకుండా వుండిపోయిందట. ఇవే కాదు, ఈయన లిస్టులో ఇలాంటివి చాలానే వున్నాయ్. సినీ స్టార్స్‌కే కాదు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులకు సైతం ఈయన చెప్పిందే వేదం. ఒకప్పటి హీరోల దగ్గర నుంచీ, ఇప్పటి యంగ్ హీరోలూ, హీరోయిన్ల వరకూ చాలా మందికి భవిష్యత్తు.. అదేనండీ జాతకాలు చెప్పేశారీ ప్రముఖ అస్ట్రాలజిస్ట్ వేణు స్వామి.
తాజాగా ఈయన జాతక చక్రం క్రికెటర్ల వైపు మళ్లింది. అది కూడా విదేశీ క్రికెటర్లు. ఇంతకీ ఎవరా విదేశీ క్రికెటర్ అనుకుంటున్నారా.? కివీస్ ఆటగాడు ఇష్ సోదీ. వేణు స్వామితో తాజాగా ఇష్ జాతకం చెప్పించుకున్నాడు.
భారత్‌లోని పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఇష్ సోదీ కుటుంబం న్యూజిలాండ్‌లో సెటిలైంది. అలా అక్కడ పెరిగిన అతడు క్రికెట్లో స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేషనల్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకున్న ఇష్, కివీస్ తరపున బోలెడన్ని మ్యాచ్‌లు ఆడాడు.
తాజాగా వేణు స్వామి న్యూజిలాండ్ వెళ్లగా, అక్కడ ఇష్, ఆయన్ని కలిసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు తెలుసుకోవాలని ఎవరికి మాత్రం వుండదు చెప్పండి. అలాగే, ఇష్ కూడా తన జాతకం చెప్పమని కోరగా, ఆయన తనదైన శైలిలో ఇష్ భవిష్యత్తును చెప్పేసినట్లున్నారు. ఇప్పుడీ వీడియో, దీనికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో, ఈ సంగతి రివీల్ అయ్యిందన్న మాట.