T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ : ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం.!
NQ Staff - October 26, 2022 / 02:54 PM IST

T20 World Cup : ప్రపంచ కప్ పోటీలనగానే.. చిన్న జట్లకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. అది వన్డే వరల్డ్ కప్ పోటీలైనా, టీ20 వరల్డ్ కప్ పోటీలైనా.. చిన్న జట్లు చూపే పోరాట పటిమ, ఒక్కోసారి పెద్ద జట్లకు చుక్కలు చూపించేస్తుంటుంది.
అసలు విషయంలోకి వస్తే, టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌కి షాకిచ్చింది పసికూన ఐర్లాండ్. సూపర్ 12లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని ఐర్లాండ్ ఓడించింది.
డక్‌వర్త్ లూయిస్ గెలుపు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లకు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో ఆ జట్టు 157 పరుగులు చేసింది. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కి వరుణుడు పెద్ద షాక్ ఇచ్చాడు. 14.3 ఓవర్లలో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు. అలా ఐర్లాండ్‌కి విజయం దక్కింది. ఐర్లాండ్ బ్యాటింగ్ జోరు.. ఇంగ్లాండ్ చేతులెత్తేసిన వైనం.. వెరసి, ఐర్లాండ్‌దే పై చేయి అయ్యింది.. వర్షం ఐర్లాండ్‌కి ఇంకాస్త అనుకూలంగా మారిందంతే.
డక్‌వర్త్ లూయిస పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.