Team India : ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ భరతం పట్టిన భారత బౌలర్స్.. సిరీస్ మనదే!
NQ Staff - July 10, 2022 / 01:01 PM IST

Team India : ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచే ఛాన్స్ తృటిలో మిస్ చేసుకున్న భారత్ టీ 20 సిరీస్‌ని సొంతం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా గ్రేట్ విక్టరీ కొట్టింది. 49 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది.

India vs England T20 one more victory for Team India
సాధించారు…
రవీంద్ర జడేజా (46 నాటౌట్: 29 బంతుల్లో 5×4), కెప్టెన్ రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో 3×4, 2×6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (26: 15 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడటంతో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) పేలవ ఫామ్‌ని కొనసాగించగా.. సూర్యకుమార్ యాదవ్ (15) వరుసగా రెండో టీ20లోనూ విఫలమయ్యాడు. అలానే హార్దిక్ పాండ్య (12) కూడా నిరాశపరిచాడు.
జడేజా చివరి వరకూ క్రీజులో నిలిచి భారత్‌కి మెరుగైన స్కోరుని అందించాడు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రారంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్కే రాయ్ డకౌట్ అయ్యాడు. అదే కాన్ఫిడెంట్ తో భారత బౌలర్లు రెచ్చిపోయారు. భువి, బుమ్రా, పాండ్యా, చాహల్, హర్షల్ పటేల్ ఒకరికి మించి ఒకరు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్లేయర్లు ఏ మాత్రం రాణించలేకపోయారు.
జేసన్ రాయ్ (0), జోస్ బట్లర్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (19), లియామ్ లివింగ్‌స్టోన్ (15) కాసేపు క్రీజులో నిలిచినా.. వారిని చాహల్, బుమ్రా ఔట్ చేసేశారు. ఈ దశలో మొయిన్ అలీ (35: 21 బంతుల్లో 3×4, 2×6) భారీ షాట్లు ఆడుతూ భారత్ బౌలర్లపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతనికి సపోర్ట్ లభించలేదు.
మరో ఎండ్‌లోని హారీ బ్రూక్ (8), శామ్ కరన్ (2)ని ఔట్ చేసేసిన టీమిండియా ఇంగ్లాండ్ ఓటమిని ఖాయం చేసింది. చివర్లో డేవిడ్ విల్లే (33 నాటౌట్: 22 బంతుల్లో 3×4, 2×6) హిట్టింగ్‌తో ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కి మూడు వికెట్లు దక్కగా.. జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేందర్ చాహల్‌కి చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య, హర్షల్ పటేల్‌కి తలో వికెట్ దక్కింది
కట్టుదిట్టమైన బౌలింగ్ కు టపటపా వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లండ్ 121కే కుప్ప కూలింది. దీంతో 2-0 లీడ్ తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. నేడు మూడో టీ 20 మ్యాచ్ జరగనుండగా, ఇందులోను విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది.