T20 World Cup 2022 : సెంటిమెంట్ : సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి ఇండియాకి వరల్డ్ కప్
NQ Staff - October 31, 2022 / 01:11 PM IST

T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా భారత్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయినప్పటికీ టీమిండియా ఫ్యాన్స్ ఆనందంతో ఉన్నారు.
అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ వైదొలుగుతుంది. ఆదివారం మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే పాకిస్తాన్ యొక్క సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి, కానీ సౌతాఫ్రికా గెలవడంతో పాకిస్తాన్ ఇంటికి పోయింది.
మరో వైపు వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో లీగ్ దశలో ఓడిపోతే ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని క్రీడాభిమానులు అభిప్రాయం చేస్తున్నారు. 2011 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో పాలైంది.
బ్యాటింగ్ చేసిన టీమిండియా 296 పరుగులు చేసింది. ఆ లక్ష్యంలో సౌత్ ఆఫ్రికా రెండు బాల్స్ మిగిలి ఉండగా ఛేదించింది. సరిగ్గా 2022 టీ20 వరల్డ్ కప్ లో కూడా సరిగ్గా రెండు బాల్స్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక సెంటిమెంట్ ప్రకారం చూస్తే 2011 వన్డే వరల్డ్ కప్ సీన్ 2022 టీ20 వరల్డ్ కప్ లో రిపీట్ అవ్వబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.