T20 World Cup : టీ20 వరల్డ్ కప్ : టాస్ గెలిచి ఫీల్డ్ ఎంపిక చేసుకున్న బంగ్లా.. భారత్ ఫ్యాన్స్ నిరాశ
NQ Staff - November 2, 2022 / 01:26 PM IST

T20 World Cup : టి20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలు నిలవాలంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ నేడు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ రెండు జట్లు హోరాహోరీగా నేడు తలపడే పరిస్థితి ఉందంటూ క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు జట్లు కూడా హోరా హోరీగా తలపడే అవకాశం ఉందని విశ్లేషకులు ముందస్తుగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి ఎక్కువ విజయ అవకాశాలు లభిస్తున్నాయి.
కనుక ఎవరు టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం అనుకున్నారు. అన్నట్లుగానే బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పరిణామం టీమిండియా ఫ్యాన్స్ కి కాస్త నిరుత్సాహం కలిగిస్తుంది.
ఇండియా భారీ స్కోరు సాధిస్తేనే విజయంపై నమ్మకం పెట్టుకోవచ్చు అంటూ క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా బ్యాట్స్ మెన్స్ బంగ్లాదేశ్ పై గెలవాలంటే కనీసం 200 స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఆ 200 స్కోర్ ని కాపాడుకోవడం కోసం టీమిండియా బౌలర్ అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఏం జరగబోతుందో మరి కాసేపట్లో చూద్దాం.