IND vs WI : తొలి టీ20 లో రెచ్చిపోయిన భారత్.. సునాయాస విజయం
NQ Staff - July 30, 2022 / 01:28 PM IST

IND vs WI : ఇప్పటికే వెస్టిండీస్‌పై 3-0 తేడాతో సిరీస్ గెలిచిన భారత్ శుక్రవారం తొలి టీ 20 ఆడింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగులతో జయభేరి మోగించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశ్చర్యకరంగా సూర్యకుమార్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఉన్నంతసేపు చక్కటి షాట్లు ఆడిన సూర్య (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) త్వరగానే పెవిలియన్ చేరగా, అయ్యర్ (0), రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1) నిరాశపరిచారు.

IND vs WI 1st T20 India lead by 68 runs
విజయ భేరి
191 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభం నుంచి వెస్టిండీస్ తడబడుతూ వచ్చింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (15), బ్రూక్స్ (20) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోగా.. జేసన్ హోల్డర్ (0), నికోలస్ పూరన్ (18), రొవ్‌మెన్ పొవెల్ (14), సిమ్రాన్ హెట్‌మెయర్ (14), అకేల హొసెన్ (11), ఓడెన్ స్మిత్ (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
కానీ.. ఆఖర్లో భారత బౌలర్లపై ఎదురుదాడి చేసిన కీమోపాల్ (19 నాటౌట్: 22 బంతుల్లో 2×4).. విండీస్ ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డాడు. అతనికి అల్జారీ జోసెఫ్ (5 నాటౌట్: 11 బంతుల్లో) సపోర్ట్ అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అశ్విన్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, జడేజాకి చెరొక వికెట్ దక్కింది. ఓవరాల్‌గా విండీస్ టీమ్ ఛేదనలో 122/8కే పరిమితమైంది.
మొత్తానికి ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇక రెండో టీ20 మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం రాత్రి 8 గంటలకి జరగనుంది. గత బుధవారం వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌నీ 3-0తో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.