Hong Kong Cricketers : హాంగ్ కాంగ్ క్రికెటర్లు బతకడం కోసం ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

NQ Staff - September 1, 2022 / 06:34 PM IST

Hong Kong Cricketers : హాంగ్ కాంగ్ క్రికెటర్లు బతకడం కోసం ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Hong Kong Cricketers : భారతదేశంలో క్రికెట్‌ అంటే, ఓ మతం కంటే ఎక్కువ.. అన్న భావన చాలామందిలో వుంటుంది. క్రికెటర్లను దేవుడిగా భావిస్తారు.. క్రికెట్‌ని ఓ మతంలా భావించేస్తుంటారు క్రికెట్ అభిమానులు. ప్రపంచంలో ఏ దేశంలోనూ క్రికెట్ పట్ల మరీ ఇంత ఆరాధనాభావం చూడమేమో.!

కాగా, భారత క్రికెట్‌లో చాలామంది రిచ్.. సూపర్ రిచ్.! క్రికెట్‌లోకి వచ్చేముందు ఎంతటి పేదవారైనాసరే, క్రికెట్‌లోకి అడుగు పెడితే చాలు రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోతుంటారు. అంతలా క్రికెటర్ల వెంట పడుతుంటాయి పలు సంస్థలు తమ తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేయమని.

క్రికెట్‌లో రాణిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల సంగతి సరే సరి.! ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు.. హోదా, గౌరవ వేతనం వచ్చేస్తుంటాయ్.

హాంగ్ కాంగ్ కథే వేరు.!

Hong Kong Cricketers Work Delivery Boys To Make Ends Meet

Hong Kong Cricketers Work Delivery Boys To Make Ends Meet

హాంగ్ కాంగ్ క్రికెట్ జట్టు కథే వేరు. ఆ జట్లులో చాలామంది ఆటగాళ్ళు పూట గడవడం కోసం డెలివరీ బాయ్స్‌లా పని చేస్తుంటారు. హాంగ్ కాంగ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సభ్యుల్ని ఆర్థికంగా ఆదుకునేందత స్తోమత కలిగి లేదు.

కేవలం క్రికెట్ అంటే వున్న ప్యాషన్‌తోనే హాంగ్ కాంగ్ జట్టు ఆటగాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు. తమ దేశాన్ని క్రికెట్‌లో అందరూ మాట్లాడుకునే విధంగా మంచి స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. వారి కమిట్మెంట్‌కి హేట్సాఫ్ చెప్పాల్సిందే.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us