Rahul Dravid : రేపటి మ్యాచ్‌కి రోహిత్ ఆడతాడా.. ద్రవిడ్ వ్యాఖ్యలతో అయోమయంలో అభిమానులు
NQ Staff - June 30, 2022 / 02:29 PM IST

Rahul Dravid : ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే ఐదో టెస్ట్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం రోహిత్ కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లోనూ రోహిత్‌కి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అతను హోటల్ గదిలోనే ఐసోలేషన్‌లో ఉండిపోయాడు.
గందరగోళం
బుధవారం మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రోహిత్ ఇంకా దూరం అవ్వలేదని ప్రకటించాడు. దాంతో, రోహిత్ విషయంలో మరింత గందరగోళం ఏర్పడింది. రోహిత్ కు గురువారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారని చెప్పాడు. అందులో ఫలితాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుందని తెలిపాడు.
అయిదో టెస్ట్‌కు అందుబాటులో ఉండాలంటే కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్ రిజల్ట్ పొందాలి. మేము అతనిని పర్యవేక్షిస్తూనే ఉంటాం. మాకు ఇంకా 36గంటల టైం ఉంది కాబట్టి మేము అతనికి ఒకట్రెండు సార్లు కరోనా పరీక్షలు జరుపుతాం. ఆ రిజల్ట్ ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం వైద్య బృందం, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ చెప్పే రిజల్ట్ మీదే రోహిత్ ఉంటాడా, ఉండడా అనేది తెలుస్తుంది’ అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

Head Coach Rahul Dravid Backs Rohit Sharma
జూన్ 25న నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ తర్వాత రోహిత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. రోహిత్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా మయాంక్ అగర్వాల్‌ను సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ గైర్హాజరీ అయితే బుమ్రా కెప్టెన్ కావడం ఖాయంగా కన్పిస్తుంది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ అవుతాడని తెలుస్తోంది.
బుమ్రా కెప్టెన్ అయితే సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. 35 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ జట్టును నడిపించనున్న తొలి పేసర్‌గా బుమ్రా నిలుస్తాడు. 1987లో కపిల్ దేవ్ నాయకత్వం తర్వాత మరో పేసర్ భారత జట్టుకు టెస్టుల్లో కెప్టెన్సీ వహించలేదు. ఇప్పుడు ఆ అరుదైన అవకావం బుమ్రాకు రానుంది. ఇప్పటివరకు 29 టెస్టులు ఆడిన బుమ్రా 123 వికెట్లు తీశాడు. ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు