Harika : 9 నెలల గర్భంతో కాంస్యం సాధించిన క్రీడాకారిణి.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న క్రీడా లోకం
NQ Staff - August 11, 2022 / 09:39 PM IST

Harika : భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం నెగ్గి అందరి మన్ననలు అందుకుంటుంది. నిండు గర్భిణి అయిన ఆమె ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల టీమ్ తరఫున బరిలోకి దిగుతుందో లేదో అనే సందేహం అందరిలో ఉంది. విశ్రాంతి తీసుకునే వీలున్నా.. దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న చెస్ ఒలిపింయాడ్‌లో పాల్గొనాలనే సంకల్పంతో ఆమె ఈ టోర్నీలో పాల్గొంది.

Harika wins Bronze Medal Olympics
గ్రేట్ హారిక..
9 నెలల గర్భిణీగా ఉన్నా కూడా హారిక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొని, ఆమె పతకం సాధించడంతో సోషల్ మీడియా వేదికగా హారికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హారిక ఇప్పటికే ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబర్చింది. అయితే హారిక పతకం సాధించడంతో ఆమె బావ, టాలీవుడ్ దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

Harika wins Bronze Medal Olympics
9 నెలల గర్భంతో మెడలో తాను గెలిచిన పతకాన్ని వేసుకుని హారిక తీయించుకున్న ఫొటోను పోస్ట్ చేసిన బాబీ… చెస్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని కీర్తించారు. దేశం కోసం ఏదో సాధించాలన్న హారిక తపన, ఆమెలోని పోరాట పటిమ తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
తనకు పతకం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన హారిక.. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది.
Congratulations to my dearest sister in law @HarikaDronavali on winning bronze medal ?despite 9th month pregnancy at olympiad this year.? ?
You are a true fighter and we all are proud of your commitment to achieve something for our country!??
Many more to come,all the best.? pic.twitter.com/MRqDgY2Zk8— Bobby (@dirbobby) August 10, 2022