Hardik Pandya : బేబి క‌విర్‌తో ఫొటోల‌కు ఫోజులిచ్చిన హార్ధిక్ పాండ్యా దంప‌తులు..

NQ Staff - August 22, 2022 / 03:05 PM IST

Hardik Pandya : బేబి క‌విర్‌తో ఫొటోల‌కు ఫోజులిచ్చిన హార్ధిక్ పాండ్యా దంప‌తులు..

Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా కెరియ‌ర్ ప్ర‌స్తుతం ఉత్త‌మ ద‌శ‌లో ఉంది. ఐపీఎల్‌-2022కు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ త‌ర్వాత మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఐపీఎల్‌-2022లో పాండ్యా తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాకు తాజా సీజన్‌ మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. కేవలం సారథిగానే కాకుండా.. బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హార్దిక్‌ అద్భుతంగా రాణించాడు.

మ‌ధురానుభూతులు..

Hardik Pandya Couple Son Cute Photos

Hardik Pandya Couple Son Cute Photos

ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో భారత జట్టులో పునరాగమనం చేసిన హార్దిక్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదే జోష్‌లో ఆసియా కప్‌-2022 టోర్నీ ఆడే జట్టుకు ఎంపికైన హార్దిక్‌ పాండ్యా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు పయనమవుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న భార్య , ఫ్యామిలీపై ప్రేమ‌ని చాటుకుంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నాడు.

యూఏఈకి బయల్దేరే ముందు హార్దిక్‌ తన భార్య నటాషాపై ప్రేమను చాటుకుంటూ ఆదివారం ఓ పోస్ట్‌ షేర్‌ చేశాడు. గంటల వ్యవధిలోనే ఇవి వైరల్‌ అయ్యాయి. మిలియన్‌కు పైగా లైకులు సాధించాయి. ఇక తాజాగా కృనాల్ పాండ్యా కుమారుడిని ఎత్తుకున్న ఫొటోలు షేర్ చేస్తూ వెల్‌క‌మ్ టూ ది వ‌ర‌ల్డ్ అని రాసాడు. అలానే అగ‌స్థ్య ఇప్పుడు సోద‌రుడిగా భాద్య‌త‌లు నిర్వ‌ర్తించే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టు పోస్ పెట్టాడు.

Hardik Pandya Couple Son Cute Photos

Hardik Pandya Couple Son Cute Photos

గ‌త నెల జూలైలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా గుడ్ న్యూస్ చెప్పాడు. అతని భార్య పంకూరి శర్మ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింన‌ట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన కొడుకుకు కవిర్ కృనాల్ పాండ్యా పేరు పెట్టినట్లు తెలియజేశాడు. వీరిద్దరికి నెట్టింట అభినందనలు వెల్లువెత్తాయి. పంకూరి శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన కృనాల్.. 2017 డిసెంబర్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

ఇక కృనాల్‌కు తన తమ్ముడు హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్‌ దంపతుల కుమారుడు అయిన అగస్త్య అంటే చాలా ఇష్టం. కృనాల్ తరచుగా అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. హార్దిక్‌కు అన్న కృనాల్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే హార్దిక్ తీవ్రంగా గాయపడ్డ టైంలో కృనాల్, వదిన పంకూరి అతను కోలుకునేందుకు కావాల్సినంత హెల్ప్ చేశారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us