Sunil Gavaskar : 20 నిమిషాలు స‌మ‌యం ఇస్తే కోహ్లీకి మంచి స‌ల‌హాలు ఇస్తాన‌న్న మాజీ దిగ్గ‌జం

NQ Staff - July 19, 2022 / 07:01 PM IST

Sunil Gavaskar : 20 నిమిషాలు స‌మ‌యం ఇస్తే కోహ్లీకి మంచి స‌ల‌హాలు ఇస్తాన‌న్న మాజీ దిగ్గ‌జం

Sunil Gavaskar : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఫామ్ లేమితో కొన్ని రోజులుగా బాధ‌ప‌డుతూ వ‌స్తున్న కోహ్లీ ఇటీవ‌ల జ‌రిగిన ఇంగ్లండ్ సిరీస్‌లోను దారుణంగా నిరాశ‌ప‌రిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 16, 17 పరుగులతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

స‌ల‌హా ప‌నికొస్తుంది..!

తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్‌కు అతని ఇన్‌పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న నేపథ్యంలో మాట్లాడిన గవాస్కర్ ఒక్క 20నిమిషాల సమయం దొరికితే చాలంటున్నాడు.

Former Indian legend Sunil Gavaskar interesting comments

Former Indian legend Sunil Gavaskar interesting comments

రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఎదుర్కొంటున్న ఆఫ్ స్టంప్ సమస్యను అధిగమించేందుకు గవాస్కర్ దగ్గర ఐడియా ఉందట. విరాట్ అతని కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఫేజ్ కు చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్ర‌మంలో తాను స‌లహా ఇస్తానంటున్నారు గ‌వాస్క‌ర్. “అతనితో సుమారు 20 నిమిషాలు గడిపితే, అతను చేయాల్సినవి చెప్పగలను. కచ్చితంగా సహాయపడుతుందని చెప్పడం లేదు, కానీ సహాయపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ఆఫ్ స్టంప్‌కు సంబంధించి” అని గవాస్కర్ మీడియాతో అన్నారు.

“కోహ్లీ ఫామ్ గురించి ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే ఇండియా తరపున 70 అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేవాడు. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్ని ఫార్మాట్లలో రాణించాడు. సహనం పాటించాలి. ఒక ప్లేయర్ 32..33 ఏళ్లు వచ్చాయంటే అందరూ అంతే. కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం కొన్ని ఓటములను ఓర్చుకోవాలి” అని గ‌వాస్క‌ర్ స్ప‌ష్టం చేశాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us