England : ఇంగ్లండ్ గెలిచిన‌ట్టు పోస్ట‌ర్స్ క్రియేట్ చేసిన ఫ్యాన్స్.. మీకు ఇది అల‌వాటే క‌దా అని పంచ్ వేసిన

NQ Staff - July 6, 2022 / 08:23 PM IST

England   : ఇంగ్లండ్ గెలిచిన‌ట్టు పోస్ట‌ర్స్ క్రియేట్ చేసిన ఫ్యాన్స్.. మీకు ఇది అల‌వాటే క‌దా అని పంచ్ వేసిన

England  : చరిత్ర సృష్టిస్తారు అనుకున్న భార‌త ఆట‌గాళ్లు నిరాశ‌ప‌రిచారు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై తాజాగా జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓట‌మి పాలై సిరీస్‌ని 2-2తో స‌మం చేశారు. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్‌ తన ఖాతాలో వేసుకుంది.

స‌రైన పంచ్..

అంతకుముందు 1977లో పెర్త్‌ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 339 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా చేధించింది. మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత్‌పై ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇం‍గ్లండ్‌ బ్యాటర్లలో బెయిర్‌ స్టో(114), రూట్‌(142) పరుగులతో రాణించారు. కాగా ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ఇంగ్లండ్‌ సమం చేసింది.

నాలుగో రోజు వరకు పటిష్ఠ స్థితిలో కనిపించిన భారత్ ఆ తర్వాత మాత్రం క్రమంగా ఓటమి అంచుల్లోకి జారుకుంది. వికెట్లు తీయడంలో విఫలమైన భారత బౌలర్లు.. ఒత్తిడి పెంచలేకపోయారు. ఫలితంగా రూట్, బెయిర్‌స్టోలు యథేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. నాలుగో రోజు మూడు వికెట్లు తీసి జోరు చూపించినప్పటికీ ఆ తర్వాత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా అందినట్టే అందిన విజయం భారత్ చేజారింది.

అయితే, బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టు 1-0 తో ఈ సిరీస్ ను గెలిచిందంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అభిమానుల క్లబ్ ‘బార్మీ ఆర్మీ’ ట్విట్టర్ లో ఓ పోస్టు చేసింది. ఇలా తప్పుడు ఫలితాలను సృష్టించిన బార్మీ ఆర్మీ క్లబ్ పై భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మండిపడ్డాడు. తమ స్వలాభం కోసం చరిత్రను వక్రీకరించడం బ్రిటిష్ వారికి అలవాటే అని కౌంటర్ ఇచ్చాడు.

ఐదో టెస్ట్‌లో జో రూట్, జానీ బెయిర్‌స్టో అజేయ సెంచరీలతో రాణించడంతో ఆఖరి రోజు, మంగళవారం తొలి సెషన్ లోనే విజయానికి అవసరమైన మరో 119 పరుగులు రాబట్టిన ఆతిథ్య జట్టు సులువుగా గెలిచింది. రెండు ఇన్నింగ్స్ ల్లో శతకాలు చేసిన బెయిర్ స్టో కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ లో 737 పరుగులు చేసిన జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us