Poland Team : ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్ళకు రక్షణగా యుద్ధ విమానాలు.!

NQ Staff - November 18, 2022 / 09:22 PM IST

Poland Team : ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్ళకు రక్షణగా యుద్ధ విమానాలు.!

Poland Team : ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్ళు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి రక్షణగా యుద్ధ విమానాలు వెళితే ఎలా వుంటుంది.? అది నిజంగానే అద్భుతహ.!

అసలు విషయమేంటంటే, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇటీవల ఓ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దులోని పోలండ్ భూభాగంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పోలాండ్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది.

క్షిపణినిన పేల్చింది ఎవరో తేలలేదుగానీ…

పోలండ్ మీద క్షిపణి దాడి.. అంటూ ప్రచారం జరగ్గా.. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ప్రపంచంలోని వివిధ దేశాలు భయాందోళన చెందాయి. అయితే, ఆ వివాదం వెంటనే చల్లారిపోయింది. ‘పేల్చింది మేం కాదు..’ అని ఇటు ఉక్రెయిన్, అటు రష్యా ప్రకటించాయి.. పరస్పరం ఆరోపణలూ చేసుకున్నాయి.

ఇదిలా వుంటే, ఫిఫా పుట్‌బాల్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు పోలండ్ జట్టు నిన్న ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఆ జట్టుకి భద్రత కల్పించేందుకు ఎఫ్16 యుద్ధ విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పోలండ్ జాతీయ జట్టు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రమాదవశాత్తూ గానీ, ఇంకే కారణంగా గానీ క్షిపణి లాంటిదేమైనా దూసుకొస్తే, దాన్ని గాల్లోనే పేల్చెయ్యడానికి ఈ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.

 

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us