Dinesh Karthik : టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ హెల్మెట్ ఎందుకంత ప్రత్యేకం.?

NQ Staff - September 26, 2022 / 08:46 PM IST

Dinesh Karthik : టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ హెల్మెట్ ఎందుకంత ప్రత్యేకం.?

Dinesh Karthik : టీమిండియా క్రికెటర్లు మైదానంలో బ్యాటింగ్ చేసే క్రమంలో దాదాపు అంతా ఒకే తరహా హెల్మెట్ ధరిస్తుంటారు. వికెట్ కీపింగ్ సమయంలో టీమిండియాకి సంబంధించినంతవరకు ఏ వికెట్ కీపర్ అయినా కూడా అవే తరహా హెల్మెట్లను ధరించడం చూస్తుంటాం.
బౌలింగ్ తీరుని బట్టి, హెల్మెట్ వుంచాలా.? వద్దా.? అన్నది వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నిర్ణయించుకుంటారు. టీమిండియాకి సంబంధించినంతవరకు చూసుకుంటే దినేష్ కార్తీక్ వెరీ వెరీ స్పెషల్‌గా కనిపిస్తుంటాడు హెల్మెట్ల వాడకం విషయంలో.

మిగతా ఆటగాళ్ళ కంటే భిన్నంగా ఎందుకు.?

దినేష్ కార్తీక్ వాడే హెల్మెట్ నిజంగానే వెరీ వెరీ స్పెషల్. ఇలాంటి హెల్మెట్ దాదాపుగా టీమిండియాలో ఎవరూ వాడరు. షేప్ పరంగా చూసుకున్నా, సౌకర్యాల పరంగా చూసుకున్నా, రక్షణ పరంగా తీసుకున్నా కూడా దినేష్ కార్తీక్ హెల్మెట్ చాలా బావుంటుందట.
హెల్మెట్ ధరించడం వల్ల పట్టే చెమటతో ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. దినేష్ కార్తీక్‌కి ఆ సమస్య పెద్దగా వుండదు. ఎందుకంటే, ఆ హెల్మెట్‌కి రంధ్రాలు ఎక్కువగా వుంటాయ్. పైగా, ఇది తేలికైనదీ, ధృడమైనదీ కూడా. బేస్‌బాల్ ఆడేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి హెల్మెట్లను ధరిస్తుంటారు.
సాధారణ హెల్మెట్లు గోళాకారంలో మధ్యలో ఉబ్బెత్తుగా వుంటాయి. కానీ, దినేష్ కార్తీక్ హెల్మెట్ అందుకు భిన్నమైన ఆకారంలో వుంటుంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us