Sachin Tendulkar : క్రికెట్ గ్రౌండ్ వదిలి కొత్త గ్రౌండ్ లో అడుగు పెట్టిన క్రికెట్ దేవుళ్లు
NQ Staff - October 7, 2022 / 09:20 AM IST

Sachin Tendulkar : వారిద్దరూ క్రికెట్ అభిమానులకు దేవుళ్ళతో సమానం… క్రికెట్ ని ఆకాశమే హద్దు అన్నట్లుగా ఇండియాలో క్రేజ్ పెంచిన స్టార్స్ వారిద్దరు. వారిద్దరూ గతంలో కలిసి ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వారిద్దరూ ఆటకు దూరమయ్యారు.
రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్ మరియు మహేంద్రసింగ్ ధోని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఆట కోసం అభిమానుల కోసం రెగ్యులర్ గా గ్రౌండ్ లో సందడి చేసే ఈ ఇద్దరు ఈసారి టెన్నిస్ గ్రౌండ్లో ప్రత్యక్షమయ్యారు.
ఒక యాడ్ చిత్రీకరణ కోసం వీరిద్దరూ టెన్నిస్ గ్రౌండ్లో కొద్ది సేపు టెన్నిస్ ఆడుతూ సందడి చేశారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరి యొక్క యాడ్స్ కాస్త తగ్గాయని చెప్పాలి. ఆ లోటును ఈ యాడ్ తప్పకుండా భర్తీ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా సచిన్ టెండూల్కర్ మరియు మహేంద్రసింగ్ ధోని ఆటను మిస్ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానులకు కచ్చితంగా ఈ యాడ్ ఒక ప్రత్యేకమైనదిగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి టెన్నిస్ గ్రౌండ్ ప్రాక్టీస్ వైరల్ అవుతుంది. క్రికెట్ గ్రౌండ్ వదిలేసి టెన్నిస్ గ్రౌండ్లో వీరిద్దరూ ఆడడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
MS Dhoni & Sachin Tendulkar clicked during a shoot?❤️@msdhoni | @sachin_rt | #Thala pic.twitter.com/mgydrhmZeU
— Anjali ♡ (@imAnjalii718) October 6, 2022