Delhi Capitals: డీసీ టీంలో క‌రోనా క‌ల‌క‌లం.. వేదిక మారుస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

NQ Staff - April 19, 2022 / 09:10 PM IST

Delhi Capitals: డీసీ టీంలో క‌రోనా క‌ల‌క‌లం.. వేదిక మారుస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

Delhi Capitals: గ‌త ఏడాది క‌రోనాతో ఐపీఎల్ నిర్వాహ‌ణ‌పై సందిగ్ధం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ సారి ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటూ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలగా నిన్న (ఏప్రిల్ 18న) నిర్వహించిన పరీక్షల్లో ఆసీస్ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌తో పాటు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. . దీనిపై అటు బీసీసీఐ ఇటు ఢిల్లీ మేనేజ్ మెంట్ మొదట్లో గోప్యత వ్యవహరించినా చివరకు వార్త బయటకు వచ్చింది.

Delhi Capitals player Mitchell Marsh hospitalised after testing positive for Covid-19

Delhi Capitals player Mitchell Marsh hospitalised after testing positive for Covid-19


దాంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇరుజట్ల ప్లేయర్లకు మరో విడత కరోనా పరీక్షలు నిర్వహించిన ఐపీఎల్ యాజమాన్యం, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లందరినీ రెండు రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ముంబై నుంచి పూణే బయలుదేరి వెళ్లాల్సి ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.కరోనా కేసుల కారణంగా ఈ ప్రయాణం వాయిదా పడింది.

ఢిల్లీ ప్లేయర్లు క్వారంటైన్‌లో ఉండడంతో షెడ్యూల్‌లో మార్పులు చేయకుండా పంజాబ్ కింగ్స్‌‌తో మ్యాచ్ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. రేపు (ఏప్రిల్‌ 20) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఢిల్లీ-పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ యధావిధిగా కొనసాగుతుందని, అయితే మ్యాచ్‌ వేదిక పూణే నుంచి ముంబైకి మార్చబడినట్లు డీసీ యాజయాన్యం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.

ఈ మ్యాచ్‌కు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బృందానికి ఇవాళ మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందులో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తే మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

ఈ సందర్భంగా తమ బృందంలో కరోనా బారినపడిన వారి పేర్లను వెల్లడించింది. ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ (ప్లేయర్‌), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్‌ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. వీరిలో మిచెల్‌ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us