Ben Stokes : క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంగ్లీష్ పైత్యం..! ఏకి పారేస్తున్న నెటిజన్లు.!
NQ Staff - October 1, 2022 / 09:38 PM IST

Ben Stokes : క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్‌లో.. అని చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు కూడా. ఒకప్పుడు క్రికెట్‌ని జెంటిల్మెన్ గేమ్‌గా చూసిన ఇంగ్లాండ్ జట్టులో కొందరు ఆటగాళ్ళు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీయడం మొదలు పెట్టారు. బెన్ స్టోక్స్.. చాలామంచి ఆటగాడు. కానీ, క్రీడా స్ఫూర్తి విషయంలో అతనికి మైనస్ మార్కులే పడతాయ్.!
అలాంటి బెన్ స్టోక్స్, టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మపై అభ్యంతకరమైన కామెంట్లు చేస్తున్నాడు. అతనొక్కడే కాదు, ఇంగ్లాండ్ క్రికెటర్లలో చాలామంది ఇదే పని చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియా అయితే, మరీ దారుణంగా ట్రోల్ చేస్తోంది దీప్తి శర్మని.
దీప్తి శర్మది తప్పు కాదు.. ఇంగ్లాండ్ చేసిన తప్పులకు లెక్కే లేదు..
క్రీడా స్ఫూర్తి గురించి ఇంగ్లాండ్ టీమ్ మాట్లాడితే అసహ్యంగా వుంటుందంటూ పలువురు క్రీడా రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీప్తి శర్మకి బాసటగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, దానిపై బెన్ స్టోక్స్ స్పందించాడు.
2019 వరల్డ్ కప్ అయిపోయి చాలాకాలమే అయ్యిందనీ, ఇప్పటికీ తనను కొందరు భారతీయులు ట్రోల్ చేస్తున్నారనీ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.. అక్కడికేదో దీప్తి శర్మ మీద ట్రోలింగ్‌లో తప్పు లేదన్నట్టు.
‘క్రీడా స్ఫూర్తి గురించి ఎవరు మాట్లాడినా ఫర్లేదు.. ఇంగ్లీష్ క్రికెటర్లు మాత్రం మాట్లాడకూడదు..’ అంటూ మైదానంలో తప్పుడు ఆటలు ఆడిన ఇంగ్లాండ్ జాతకాల్ని నెటిజన్లు బయట పెడుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్విమెన్ని భారత బౌలర్ దీప్తి శర్మ రనౌట్ చేయడమే ఈ వివాదానికి కారణం.