Hyderabad Cricket Association: క్రికెట్ టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు.! ఇంత హీనమా.?

NQ Staff - September 22, 2022 / 08:28 PM IST

160151Hyderabad Cricket Association: క్రికెట్ టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు.! ఇంత హీనమా.?

Hyderabad Cricket Association: హైద్రాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. అభిమానులు సర్వసన్నద్ధమైపోయారు. తరచూ జరిగే వ్యవహారమే ఇది. ఇప్పుడే కొత్తగా హైద్రాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ‘న్యూసెన్స్’ క్రియేట్ అయ్యింది.

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం విషయంలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసింది. దాంతో, క్రికెట్ మ్యాచ్ చూడాలనుకున్న క్రికెట్ అభిమానులు రోడ్డున పడాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూలేని పరిస్థితి ఈసారి కనిపిస్తోంది.

తప్పెవరిది.? పోలీసులదా.? హెచ్‌సీఏదా.?

 Cricket Fans Are wrong The Way Of Hyderabad Cricket Association

Cricket Fans Are wrong The Way Of Hyderabad Cricket Association

పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదన్న కొన్ని విమర్శలు వస్తోంటే, హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరునే క్రికెట్ అభిమానులు ఎక్కువగా తప్పు పడుతున్నారు. కౌంటర్లు తక్కువగా తెరిచారు, డిజిటల్ పేమెంట్స్ విషయంలో గందరగోళం.. వెరసి వందలాది మంది, వేలాది మంది క్రికెట్ అభిమానులు నానా ఇబ్బందులూ పడ్డారు.

‘హెచ్‌సీఏ మాకు తగిన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి..’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూని దెబ్బ తీసే విషయమిది. క్రికెట్ అభిమానులు మ్యాచ్ టిక్కెట్ల కోసం కొట్టుకోవడమా.? ఈ క్రమంలో తొక్కిసలాట జరగడమా.? సిగ్గు సిగ్గు.?
అసలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ముందస్తుగానే స్పందించాల్సిన రీతిలో స్పందిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదేమో.!