Chahal : విడాకుల దిశగా క్రికెటర్ చాహల్.! భార్య ధనశ్రీ అందుకే ఆ పేరు తొలగించిందా.?
NQ Staff - August 18, 2022 / 10:53 PM IST

Chahal : టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడా.? భార్య ధనశ్రీ వర్మతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయా.? ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ అవుతున్నాయి.

Chahal and Dhanshree going to separation
చాహల్ – ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం గమనార్హం.
చాహల్ పేరు ఎందుకు తొలగించిందబ్బా.?
ఇటీవల చాహల్ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ‘చాహల్’ అనే పేరుని తొలగించింది. గత కొంతకాలంగా సెలబ్రిటీలు విడాకుల ప్రకటనకు ముందు ఇలాగే పెళ్ళి ద్వారా వచ్చిన కొత్త ఇంటి పేరుని తొలగిస్తూ, విడాకుల సంకేతాల్ని అందిస్తున్న విషయం విదితమే.
చాహల్ – ధనశ్రీ విషయంలో అదే జరుగుతోందా.? ఏమోగానీ, ఈ మధ్యనే మరో టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టీలో చాహల్ సతీమణి సందడి చేసింది. ఆ వేడుకకు చాహల్ హాజరు కాలేదు. ఈ వేడుకకు సంబంధించి ధనశ్రీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
‘చాహల్‌ని వదిలేసి సూర్యకుమార్ యాదవ్‌ని పటాయించావా.?’ అంటూ ధనశ్రీ మీద సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే, విడాకుల విషయమై ఇటు చాహల్‌గానీ, అటు ధనశ్రీగానీ ఇంతవరకు స్పందించలేదు.