Chahal : విడాకుల దిశగా చాహల్-ధనశ్రీ.. స్పందించిన స్పిన్నర్
NQ Staff - August 19, 2022 / 09:06 AM IST

Chahal : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల అంశం తెగ హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా మంది లేనిపోని కారణాలకు విడాకులు తీసుకుంటున్నారు. అయితే క్రికెట్ వరల్డ్‌తో పోల్చుకుంటే సినీ పరిశ్రమలోనే విడాకులు ఎక్కువ. అంతే కాకుండా క్రికెట్ కపుల్స్ అందరూ చాలా క్యూట్‌గా ఉంటారని ఎప్పటికప్పుడు అభిమానులు వారిని ప్రశంసిస్తూ ఉంటారు.

Chahal and Dhanashree clarity
పుకార్లకి చెక్..
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయి అనే వార్త నెట్టింట్లో హల్‌చల్ చేసింది. ఈ జంట ఒకప్పుడు తమ రొమాంటిక్ చిత్రాలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 22 డిసెంబర్ 2020న యుజ్వేంద్ర, ధనశ్రీ తమ పెండ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. మరోసారి సీక్రెట్ పోస్టులతో నెటిజన్లను అయోమయంలో పడేశారు.
ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ని తొలగించడంతో, అసలు చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఆమె తన పేరుగా ‘ధన్‌శ్రీ వర్మ’ని వాడుతోంది. ఇంతకుముందు ధన్‌శ్రీ చాహల్ అని ఉండేది. ఆ మరుసటి రోజే యుజ్వేంద్ర చాహల్ “కొత్త జీవితం లోడ్ అవుతోంది” అంటూ ఇన్‌స్టా రీల్‌లో ఓ ఫొటోను పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు, ఈ జోడీ తమ బంధానికి బ్రేకులు పడుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీరిద్దరి ప్రవర్తన చూస్తుంటే విడాకుల బాట పట్టనున్నారేమో అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. అందుకే 24 గంటలు తిరగకుండానే చాహల్.. తన సోషల్ మీడియాలో మరో పోస్ట్‌తో ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చాడు. ‘మా రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఏ ఒక్క పుకారును కూడా నమ్మవద్దని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. దీనికి స్వస్తి పలకండి’ అని చెప్పుకొచ్చాడు చాహల్. దీంతో చాహల్, ధనశ్రీ ఫ్యాన్స్ మనసు కాస్త కుదుటపడినట్టు తెలుస్తోంది.