Ben Stokes : ఒకే రోజు ఇద్ద‌రు విధ్వంస‌క‌ర ఆట‌గాళ్లు వీడ్కోలు.. నిరాశ‌లో అభిమానులు

NQ Staff - July 19, 2022 / 06:25 PM IST

Ben Stokes  : ఒకే రోజు ఇద్ద‌రు విధ్వంస‌క‌ర ఆట‌గాళ్లు వీడ్కోలు.. నిరాశ‌లో అభిమానులు

Ben Stokes  : జెంటిల్మ‌న్ గేమ్ క్రికెట్‌లో పాపుల‌ర్‌ ఫార్మాట్ అయిన వ‌న్డేల‌కు ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వీడ్కోలు ప‌లికాడు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం అత‌డు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాడు.టీమిండియాతో వ‌న్డే సిరీస్ ముగిసిన మ‌రునాడే అత‌డు వ‌న్డే క్రికెట్‌కు గుడ్‌బై ప‌లుకుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయడం గ‌మ‌నార్హం.

క్రికెట్‌కి గుడ్ బై..

ఇక వెస్టిండీస్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం నాడు సిమ్మన్స్ ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఇందులో అతడు తన 16 ఏళ్ల క్రికెట్‌కు కెరీర్‌కు ముగింపు పలికినట్లు పేర్కొంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఈ మేరకు లేఖను పంపినట్లు స్పష్టం చేసింది. 16 ఏళ్ల కెరీర్‌లో విండీస్ తరఫున ఎన్నో మరపురాని విజయాల్లో ప్రాతినిధ్యం వహించాడు సిమ్మన్స్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అత్యంత భీకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Ben Stokes Said Goodbye ODI Cricket

Ben Stokes Said Goodbye ODI Cricket

2008లో తొలిసారిగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సిమ్మన్స్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అంతకంటే ముందే 2007లో టీ20ల్లో, 2009లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. చివరగా అతడు గతేడాది దుబాయ్‌లో జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

కెరీర్‌లో ఇప్పటి వరకు 8 టెస్టులు, 68 వన్డేలు, 68 టీ20ల్లో విండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 278 పరుగులు, వన్డేల్లో 1958 పరుగులు, టీ20ల్లో 1527 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 25 అర్ధ సెంచరీలు (అన్నీ ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి.

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు, పాక్ సూపర్‌ లీగ్‌ల కరాచీ కింగ్స్ ఇలా బ్రిస్బేన్ హాట్, చాటోగ్రామ్ ఛాలెంజర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ ఇలా వివిధ దేశీయ టీ20 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us