Ben Stokes : చివరి మ్యాచ్‌లోను నిరాశ‌ప‌ర‌చిన బెన్ స్టోక్స్..స్టాండింగ్ ఓవేషన్‌తో వీడ్కోలు

NQ Staff - July 20, 2022 / 04:11 PM IST

Ben Stokes  : చివరి మ్యాచ్‌లోను నిరాశ‌ప‌ర‌చిన బెన్ స్టోక్స్..స్టాండింగ్ ఓవేషన్‌తో వీడ్కోలు

Ben Stokes  : ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ 31 ఏళ్ల వ‌య‌స్సులో వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మంగళవారం డర్హమ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్ తనకు చివరి వన్డే అని తెలిపాడు. అయితేఏ ఈ నిర్ణయం ఎంతో కఠినమైందన్నాడు. సహచరులతో కలిసి ఇంగ్లాండ్‌ తరఫున ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానన్నాడు. వన్డే ఫార్మాట్లో తాను వంద శాతం న్యాయం చేయలేపోతున్నాని స్టోక్స్ తెలిపాడు.

ఇలా ముగిసింది..

Ben Stokes Said Cannot Justice ODI Format

Ben Stokes Said Cannot Justice ODI Format

మంగళవారం తన చివరి మ్యాచ్ ఆడిన ఈ ప్లేయర్ కెరీర్‌ను ఘనంగా ముగించలేదు. సౌతాఫ్రికాతో జరిగిన ఈ గేమ్‌లో స్టోక్స్ 5 పరుగులే చేసి ఔటయ్యాడు. ఫలితంగా నిరాశతో పెవిలియన్ వైపు నడిచాడు. అయితే నిరాశతో వెనుదిరిగినా.. స్టేడియంలో ప్రేక్షకుల మాత్రం అద్భుతమైన వీడ్కొలు పలికాడు. పెవిలియన్ వైపు వస్తుంటే స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చి మరి అతడికి గుడ్ బై చెప్పారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. 334 పరుగుల లక్ష్య ఛేదనం కోసం నాలుగో బ్యాటర్‌గా వచ్చిన స్టోక్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ ఎయిడెన్ మార్క్రమ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన్ స్టోక్స్.. ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఫలితంగా తన చివరి వన్డేలో 5 పరుగులే చేసి 50 ఓవర్ల క్రికెట్‌లో తన కెరీర్‌ను ముగించాడు.

Ben Stokes Said Cannot Justice ODI Format

Ben Stokes Said Cannot Justice ODI Format

చివరి వన్డే ఆడిన ఈ ఆల్‌రౌండర్ మైదానంలో ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఓవేషన్ అందుకుని కరచాలనాలు, చప్పట్లు, అభినందనలతో కెరీర్‌ను ముగించడం విశేషం. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో జోయ్ రూట్(86), జానీ బెయిర్ స్టో (63) అర్ధ శతకాలు మినహా మిగిలిన ఇంగ్లీష్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

 

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us