Australian Team : టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా జెర్సీపై సంక్రాంతి ముగ్గులేశారేంటీ.?
NQ Staff - September 14, 2022 / 05:37 PM IST

Australian Team : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ – నవంబర్ నెలల్లో ప్రపంచ కప్ టీ20 పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా ఈసారి బరిలోకి దిగబోతోంది. కాగా, ప్రతిసారిలాగానే, ఈసారి కూడా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళు కొత్త జెర్సీతో మైదానంలో సందడి చేయబోతున్నారు.

Australian Team Field New Jersey
కొత్త జెర్సీని తాజాగా విడుదల చేశారు. ఆస్ట్రేలియా జట్టు అంటేనే యెల్లో కలర్ జెర్సీలుంటాయ్.. దాని మీద రకరకాల డిజైన్లుంటాయి. ఈసారి డిజైన్ల కోసం మన సంక్రాంతి ముగ్గుల్ని పరిగణనలోకి తీసుకున్నట్టున్నారు. ‘ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్ సంక్రాంతి ముగ్గుని తలపిస్తోంది..’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరి.!

Australian Team Field New Jersey
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా..

Australian Team Field New Jersey
టీమిండియా – క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య పోరు అంటే, దాయాది జట్ల మధ్య పోటీలాగానే వుంటుంది. దాంతో, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ని టీమిండియా కైవసం చేసుకోవాల్సిందేనన్న కసి భారత క్రికెట్ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Australian Team Field New Jersey
సూపర్ 12 దశలో గ్రూప్ 1 విషయానికొస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆప్గనిస్తాన్ తదితర జట్లున్నాయి. గ్రూప్ 2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తదితర జట్లు వున్నాయి. భారత్ – పాక్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 23న వుంటుంది.