Asia Cup : ఆసియా కప్‌.. భారత్‌ కి ఫైనల్ ఆశలు గల్లంతు

NQ Staff - September 8, 2022 / 10:32 AM IST

Asia Cup : ఆసియా కప్‌.. భారత్‌ కి ఫైనల్ ఆశలు గల్లంతు

Asia Cup : ఆసియా కప్ ఫైనల్ లో ఆడాలనే భారత్ ఆశలు ఆవిరయ్యాయి. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో పాకిస్తాన్ ఫైనల్ కి చేరగా టీం ఇండియా ఆశలు సన్నగిల్లాయి. ఆసియా కప్ పై సుదీర్ఘ కాలంగా చాలా ఆశలు పెంచుకున్న భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Asia Cup Final hopes lost for India

Asia Cup Final hopes lost for India

పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల తో జరిగిన మ్యాచ్ ల్లో భారత్ ఓటమి పాలవడంతో ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. మొన్నటి వరకు కాస్త నమ్మకం ఉన్నప్పటికీ నిన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత అది కూడా క్లియర్ అయిపోయింది.

ఆసియా కప్ 2022 లో ఇండియా యొక్క ప్రస్థానం ముగిసినట్లే. ఫైనల్ లో శ్రీలంక మరియు పాకిస్తాన్ పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ మరియు శ్రీలంక రెండు విజయాలతో ఫైనల్ అవకాశాన్ని ఖరారు చేసుకున్నాయి. రోహిత్ సేన ఓటమికి పేలవమైన ఫీలింగ్ కారణమంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా టీం ఇండియా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఈ సమయంలో ఇలా ఆసియా కప్ చేజార్చుకోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ప్రపంచ కప్ కి ఇది ఆరంభంగా అంత భావించారు.. కానీ అనూహ్యంగా ఆసియా కప్ లో ఓటమి పాలవ్వడంతో వరల్డ్ కప్ లో వీళ్ళు ఏం ప్రభావం చూపుతారో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us