T20 Match : వెస్టిండీస్- ఇండియా మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కు రావాల్సిన ఆటగాళ్ల లగేజీ ఆలస్యం అవడమే అందుకు ప్రధాన కారణం. రాత్రి 8 గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ ఎట్టకేలకు 11 గంటలకు ప్రారంభం అయింది.
లగేజ్ సమస్య…
టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే లగేజ్ సమస్య వలన ముగ్గురు ఆటగాళ్లు ఇతరుల జెర్సీలు వేసుకొని బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇలా వచ్చినవారిలో సూర్యకుమార్ యాదవ్ తో పాటు అవేశ్ ఖాన్ ఉన్నారు.
నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ తో పాటు సూర్య కుమార్ యాదవ్ ఓపెనర్‌గా వచ్చాడు. సూర్య లగేజీ అప్పటికీ రాకపోవడంతో అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్నాడు. అవేశ్ ఖాన్ దీ అదే పరిస్థితి. ఇక అర్ష్‌దీప్ ఎలాగూ తన జెర్సీనే వేసుకోవడంతో నిన్నటి మ్యాచ్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లను వెనుకనుంచి చూసినవారికి ఎవరు అసలైన అర్ష్‌దీప్ అని తేల్చుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యారు.

వీళ్లే గాక మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన దీపక్ హుడా కూడా ప్రసిధ్ కృష్ణ జెర్సీ వేసుకున్నాడు. ఈ ఇద్దరూ అధికారికంగా నిన్నటి మ్యాచ్ లో భాగం కాకున్నా ఒకరి జెర్సీ మరొకరు వేసుకోవడం విశేషం. ప్రస్తుతం దీనిపై ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి.
అర్ష్‌దీప్ తో ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఇది సరైందో కాదో మరి ఒకసారి చూసుకున్నారా..?’, ‘అర్ష్‌దీప్ జెర్సీకి ఇంత ప్రాముఖ్యత ఉన్నదని ఈ మ్యాచ్ చూసేదాకా తెలియలేదు’, ‘ముగ్గరు అర్ష్‌దీప్ లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. మరి అతడికి కనీసం ఒక్క ఓవర్ అయినా ఎక్కువివ్వరా..?’, ‘అర్ష్‌దీప్ జెర్సీ వేసుకున్న అవేశ్.. అతడిలాగే బౌలింగ్ చేస్తాడా..?’ అని నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.అంతకముందు భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (0), సూర్యకుమార్ (11), అయ్యర్ (10) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాసేపు ఆదుకున్నారు. జడేజా (30 బంతుల్లో 27; 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. అయితే మెకాయ్ (4–1–17–6) బెంబేలెత్తించాడు.ఇరుజట్ల మధ్య మూడో టి20 శనివారం(ఆగస్టు 2న) జరగనుంది.
Importance of Arshdeep's jersey#WIvIND #Arshdeepsingh pic.twitter.com/4lgXxKH0lD
— Dinesh Lilawat (@DineshLilawat45) August 1, 2022