IPL Captain : మరోసారి ధోని సంచలన నిర్ణయం.. జట్టు పగ్గాలు ఎవరికి అప్పగించారంటే..!
NQ Staff - March 24, 2022 / 03:49 PM IST

IPL Captain : టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ధోని సారథ్యంలో ఈ చెన్నై అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
2010, 2011, 2018, 2021 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచీ ధోనినే సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి గైర్హాజరీలో సురేశ్ రైనా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది.
కానీ.. తొలి మ్యాచ్ ముంగిట కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతికి టీమ్ పగ్గాలిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఆ జట్టుని ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు.

All Rounder Ravindra Jadeja was Officially Announced as the Team Captain today
వాస్తవానికి ఐపీఎల్ 2022 వేలానికి ముందే ధోనీ తాను కెప్టెన్సీ నుంచి వైదొలగబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. ఈ ఏడాది రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది. వీరిలో ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్‌గా ధోనీకి బదులుగా జడేజాని ఎంచుకున్న చెన్నై.. అతనికి ఈ ఏడాది రూ.16 కోట్లని చెల్లించింది. ఇక సెకండ్ ఛాయిస్ ప్లేయర్‌గా ధోనీని ఎంచుకుని ఈ ఏడాది రూ.12 కోట్లు మాత్రమే అతనికి ఇచ్చింది.
ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటించే వరకూ ధోనీనే మా కెప్టెన్ అని గత ఏడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ.. ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. 40 ఏళ్ల ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో.. ధోనీ తాను టీమ్‌లో ఉండగానే కొత్త కెప్టెన్‌ని తయారు చేసే బాధ్యతని కూడా తీసుకున్నట్లు కనిపిస్తోంది.