Rohit Sharma : ఒకే ఒక్కడు… రోహిత్ శర్మ నిజంగా తోపు అంటున్న ఫ్యాన్స్
NQ Staff - September 15, 2022 / 06:12 PM IST

Rohit Sharma : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ 2022 వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం అయ్యి 15 సంవత్సరాలు కాబోతుంది.. 2007లో మొదటి సారి టీ20 ప్రపంచ వరల్డ్ కప్ జరిగిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్ కప్పులో టీమిండియా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని విన్నర్ గా నిలిచింది. మళ్లీ ఈసారి టీమిండియా గెలవాలని కోరికతో అభిమానులు ఉన్నారు
2022 టీ20 ప్రపంచ కప్ లో

All Players Played First T20 World Cup Retired Except Rohit Sharma
ఆడబోతున్న టీమిండియా క్రికెటర్లలో కేవలం ఒకే ఒక్కడు 2007 మొదటి టీ20 ప్రపంచ కప్ ఆడాడు. అతడే రోహిత్ శర్మ.. మొదటి టీ20 ప్రపంచ కప్ ఆడిన వారందరి రిటైర్మెంట్ తీసుకున్నారు రోహిత్ శర్మ తప్ప.
ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఈ ప్రపంచ పోరులో తలబడబోతున్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా రోహిత్ శర్మకు ఇది ప్రతిష్టాత్మక టోర్నీ అవ్వబోతుంది.
మొన్న జరిగిన ఆసియా కప్ లో నిరాశ పరిచినా కూడా తప్పకుండా వరల్డ్ కప్ గెలుచుకొని మరి టీమిండియా నెంబర్ వన్ గా నిలుస్తుంది అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు.
రోహిత్ శర్మకు ఉన్న అనుభవం ఆయన కెప్టెన్సీ కారణంగా కచ్చితంగా ఈ సిరీస్ సొంతం చేసుకుని వరల్డ్ కప్ విజేతగా మరోసారి టీం ఇండియా నిలిచే అవకాశాలు ఉన్నాయని రోహిత్ అభిమానులు ధీమాతో ఉన్నారు.