Viral Video : టీ20 వరల్డ్ కప్ : ఇండియా – నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ప్రేమికురాలికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.! వీడియో వైరల్.!

NQ Staff - October 27, 2022 / 05:03 PM IST

Viral Video : టీ20 వరల్డ్ కప్ : ఇండియా – నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ప్రేమికురాలికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.! వీడియో వైరల్.!

Viral Video : టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా భారత్ – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ భారత క్రికెట్ అభిమాని, గ్యాలరీల్లో కూర్చుని అందరూ విస్తుపోయే పని చేశాడు. తన ప్రియురాల్ని కూడా ఆ మ్యాచ్‌కి తీసుకొచ్చిన ఆ అభిమాని.. అందరూ చూస్తుండగానే ఆమెకు ‘ప్రపోజ్’ చేశాడు.

ఊహించని ఈ ఘటనకు ఆ యువతి తొలుత షాక్‌కి గురయ్యింది. తేరుకుని, అతని లవ్ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసేసింది కూడా. దాంతో, ఆ ప్రేమికుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.

వైరల్‌గా మారిన వీడియో..

నిజానికి, ఇలాంటి ఘటనలు క్రికెట్ మైదానంలో తరచూ జరుగుతూనే వుంటాయి. వాటిని బిగ్ స్క్రీన్ మీద చూపించడం మాత్రం చాలా చాలా అరుదు. సదరు ప్రేమికుడు, తన ప్రేమికురాలికి ప్రపోజ్ చేయడం, ఆమె అనుమతించడంతో ఉంగరం తొడగడం.. ఇదంతా బిగ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యింది.

మరోపక్క, ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘నీ లవర్ నీ ప్రేమను అంగీకరించింది.. అది ప్రపంచమంతా చూసింది.. నీకన్నా అదృష్టవంతుడు ఇంకెవరు.?’ అని పలువురు ఆ లవర్‌కి విషెస్ అందిస్తున్నారు. మరోపక్క, ఇది అటెన్షన్ కోసం చేసిన పబ్లిసిటీ జిమ్మిక్కు.. అని కొందరు కొట్టిపారేస్తున్నారు.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us