MS Dhoni : ఇది క‌దా ధోని క్రేజ్ అంటే.. కృష్ణా జిల్లాలో మిస్ట‌ర్ కూల్ కోసం 41 అడుగుల క‌టౌట్

NQ Staff - July 6, 2022 / 08:48 PM IST

MS Dhoni : ఇది క‌దా ధోని క్రేజ్ అంటే.. కృష్ణా జిల్లాలో మిస్ట‌ర్ కూల్ కోసం 41 అడుగుల క‌టౌట్

MS Dhoni : ఎంఎస్ ధోని.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు ధోని. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్న ధోని.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

ద‌టీజ్ ధోని..

కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, అటు బిజినెస్ లు ధోనీ ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోని కూడా తగ్గేదే లే అన్నట్టుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.

 MS Dhoni, Krishnna , Fans, Sports person, Chennai , IPL

MS Dhoni, Krishnna , Fans, Sports person, Chennai , IPL

ధోనికి దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. అయితే తమిళియన్స్‌తో ధోనికి ఉన్న అనుబంధమే వేరు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆయన ఆడటంతో తమిళ ప్రజలకు ధోని అంటే ప్రాణం. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా ధోనిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. త్వ‌ర‌లో ధోని 41వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్న నేప‌థ్యంలో కృష్ణా జిల్లో భారీ క‌టౌట్ ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో నటులు, రాజకీయ నాయ‌కుల‌కి సంబంధించి భారీ క‌టౌట్స్ చూసాం. కాని తొలిసారిగా ఓ స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌కి సంబంధించి ఇంత భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ధోని అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంత ప్రేమ ఉంద‌నేది ఇప్పుడు అర్ధం అవుతుంది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వత ధోని వ్యవసాయాధారిత, వస్త్ర, లిక్కర్, మోటార్ కార్ రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నాడు. ఝార్ఖండ్ లోని చిన్న పట్టణం రాంచీకి చెందిన ధోనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అలానే ప్ర‌జ‌ల‌కు త‌న వంతు సాయం కూడా చేస్తున్నాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us