Indonesia : ఇండోనేషియాలో దారుణం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా 130 మంది మృతి

NQ Staff - October 2, 2022 / 05:23 PM IST

Indonesia : ఇండోనేషియాలో దారుణం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా 130 మంది మృతి

Indonesia : ఇండోనేషియా జరిగిన ఒక ఫుట్‌ బాల్‌ మ్యాచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం ప్రారంభమైన గొడవ చిలికి చిలికి పెద్దగా మారింది. దాంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ వదలడంతో గాలిలో ఆక్సిజన్ అందక ఏకంగా 130 మంది చనిపోయారు అంటూ తెలుస్తోంది.

ఇంకా పలువురుకి తీవ్ర అస్వస్థతగా ఉందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది.

ఆ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు యొక్క అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి దిగారు. ఆటగాళ్ల పై అభిమానుల దాడితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడున్న పోలీస్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ వదలడం జరిగింది.

దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు వదిలారు. స్టేడియంలోనే దాదాపు 30 మంది మరణించగా కొద్ది మంది ఆసుపత్రికి తరలిస్తుంటే మరణించారు. మరి కొంత మంది హాస్పిటల్ లో మరణించారు.

ఈ సంఘటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఫుట్‌ బాల్ స్టేడియంలో జరిగిన సంఘటనపై ఇండోనేషియా ఫుట్‌ బాల్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది, మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టేందుకు ఆదేశించింది. అల్లర్ల వెనుక దేశ ద్రోహ కుట్ర ఏమైనా ఉందా అంటూ ఎంక్వౌయిరీ జరగబోతుంది. ఈ మొత్తం వ్యవహారం ఫుట్‌ బాల్ అభిమానులకు తీవ్ర వేదనను కలిగిస్తుంది.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us