Connect with us

Entertainment

బాలు ఆసుపత్రి బిల్లు విషయం పై స్పందించిన చరణ్

Published

on

Share the News from here

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణానికి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఇదే తరుణంలో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వదంతులు బాలు ఆసుపత్రి బిల్లుపై పలు వివాదాలు సృష్టిస్తున్నారు. ఇలా వస్తున్న అసత్యపు వార్తలకు బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. అయితే బాలు చికిత్స బిల్లు చెల్లించలేదని బాలు పార్థీవ దేహాన్ని ఎంజిఎం ఆస్పత్రి వర్గాలు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించలేదని, వాళ్ళను ఇబ్బంది పెట్టిందన్నారు. అలాగే డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరగా అందుకు ఆ ప్రభుత్వం తిరస్కరించిందని పుకార్లు వస్తున్నాయి.

అంతేకాదు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన కుమార్తె దీపా వెంకట్ జోక్యం చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనితో బాలు ఆసుపత్రి బిల్లు ఎంత? ఆ బిల్లు ఎవరు కట్టారు? అనే చర్చ పెద్ద ఎత్తున వ్యక్తం అయింది. అయితే చరణ్ స్పందిస్తూ.. నా నాన్న ఆసుపత్రి బిల్లు విషయంలో వస్తున్న వార్తలు ఏవి నిజం కావని, అవి అన్ని తప్పుడు ప్రచారాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసాడు. నిజమైన బాలు అభిమానులు ఎవ్వరు ఇలా తప్పుడు ప్రచారాలు సృష్టించారు అని పేర్కొన్నాడు చరణ్. అలాగే తొందర్లో ఎంజిఎం ఆసుపత్రి దగ్గర బిల్లు సేకరించి విడుదల చేస్తామని తెలిపాడు.

Do NOT follow this link or you will be banned from the site!