Connect with us

Entertainment

ఐపీఎల్ : సంజు సాంసన్ బ్యాటింగ్ కు ఫిదా అయిన మందాన

Published

on

Share the News from here

ఈ ఐపీఎల్ సీజన్ లో యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజు సాంసన్‌ అదరగొడుతున్నాడు. అయితే ఇప్పటికే మూడు మ్యాచ్ లు అడగా.. దాంట్లో మొత్తం 167 పరుగులు సాధించాడు. నిన్న కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే అవుట్‌ అయ్యాడు. ఇక ఈ ఒక్క మ్యాచ్ వదిలేస్తే.. మిగిలిన రెండింట్లోనూ హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలిలో మెరుగ్గా ఆడుతున్న సంజు శాంసన్‌ పై రోజురోజుకు అభిమానం పెరుగుతుంది అని సంజు ఆట పై టీం ఇండియా మహిళా క్రికెటర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు సంజు బ్యాటింగ్‌ కి ఫిదా అయ్యానని.. అతడికి పెద్ద అభిమానిగా మారిపోయానని చెప్పింది. అలాగే సంజు కోసమే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు సపోర్టు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి సంజు శాంసన్ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదుగుతాడని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక సంజు బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నానని ఆమె వెల్లడించింది.

Do NOT follow this link or you will be banned from the site!