Connect with us

Entertainment

గబ్బర్ సింగ్ నా లైఫ్ ఛేంజింగ్ మూవీ : శ్రుతి హాసన్

Published

on

Share the News from here

‘శ్రుతి హాసన్’ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే శ్రుతి అగ్ర నటుడు కమల్ హాసన్ కూతురు అని అందరికి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనే మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి తెలుగు ఇండస్ట్రీ నుండే తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా రోజుల తరువాత తనకు హిట్ లభించింది. అయితే పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి, ఆమెకు పేరుప్రతిష్టలు తీసుకొచ్చింది. ఇక ఈ హిట్ తో తెలుగు, దక్షిణాది ఇండస్ట్రీకి ఎంతో కట్టుబడి ఉన్నానని ఆమె పలు సందర్భాల్లో పేర్కొంది.

ఇది ఇలా ఉంటె తాజాగా ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న శ్రుతి హాసన్ పలు విషయాలు పేర్కొంది. అయితే తెలుగు మరియు దక్షిణాది ఇండస్ట్రీలో తాను మాట్లాడిన కొన్ని మాటలను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. అలా వస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. అలాగే తెలుగులో గబ్బర్ సింగ్, రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించడం గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాదు గబ్బర్ సింగ్నా లైఫ్ ఛేంజింగ్ సినిమా అని వెల్లడించింది. దక్షిణాది ఇండస్ట్రీ నా జీవితంలో ఒక భాగమని ఆమె పేర్కొంది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!