Connect with us

Latest News

టీడీపీకి షాక్ ఇవ్వనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు ! ఆలోచనల్లో పడ్డ సీబీఎన్

Published

on

Share the News from here

టీడీపీ నుండి వైసీపీ వైపుకు పవనాలు చాలా వేగంగా విస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీ తరపున గన్నవరం నుండి గెలిచి ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ టీడీపీ పై పెద్ద బాంబ్ వేశారు.

టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో మరో నలుగురు వైసీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని చాలా పక్కాగా చెప్పారు. ఈ మాటలు విన్న చంద్రబాబు నాయుడు దీర్ఘ ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితి బట్టి చూస్తే గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజం అనుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లనున్న ఆ నాయకుల గురించి చంద్రబాబు నాయుడు ఆరా తీసే పనిలో పడ్డాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోతారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్లిన బాబు ఇప్పుడు మాములు ఎమ్మెల్యేగా వెళ్లాల్సి వస్తుంది.

Do NOT follow this link or you will be banned from the site!