Advertisement
Home Blog

PV Sindhu: వావ్ సింధు.. మొత్తానికి సెమీ ఫైన‌ల్ బెర్త్ క‌న్‌ఫాం చేసుకుందిగా..!

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధు ఏ మ్యాచ్‌లో అయిన ప్ర‌త్య‌ర్ధిని ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ‌తో ప్ర‌త్య‌ర్ధుల‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తుంటుంది. భారీ అంచ‌నాల‌తో ఒలంపిక్స్‌లోకి అడుగుపెట్టిన పీవీ సింధు మొద‌టి నుండి మంచి జోరు మీదుంది.

PV Sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే టార్గెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ధాటిగా ఆడిన సింధు ఈ మ్యాచ్‌ను 41 నిమిషాల్లోనే ముగించింది. తొలి గేమ్‌లో కాస్త తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చిన సింధు ఆ లోపాల‌ను స‌రిజేసుకొని రెండో మ్యాచ్‌లో అద‌ర‌గొట్టింది.

గ్రూఫ్‌- జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.అయిన‌ప్ప‌టికి తన ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దెబ్బకొడుతూ వ‌రుస‌గా పాయింట్లు సాధించింది . గ్రూప్-జే టాప‌ర్‌గా సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఇక సెమీ ఫైన‌ల్ కోసం హై వోల్టేజ్ ఫైట్ జ‌రిగింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో జ‌పాన్‌కు చెందిన య‌మ‌గుచిపై 21-13, 22-20 తేడాతో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో తొలుత వెనుక‌బ‌డినా.. అద్భుతంగా పుంజుకున్న సింధు 21-13తో గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు ప్ర‌ద‌ర్శించింది.

య‌మ‌గుచి ఒక ద‌శ‌లో 20-18 ఆధిక్యంలోకి వెళ్లి గేమ్ గెలిచేలా కనిపించింది. ఈ స‌మయంలో సింధు వ‌రుస‌గా నాలుగు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.దీంతో డైరెక్ట్‌గా సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. తీవ్ర సాధన, సరికొత్త టెక్నిక్‌లతో లోపాలను సరిదిద్దుకున్నానని చెబుతున్న సింధు సెమీ ఫైన‌ల్ గెలిస్తే త‌న ఖాతాలో ఏదో ఒక ప‌తాకం వ‌చ్చి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Allu Arha: ఆన్‌లైన్‌లో శ్లోకాలు నేర్చుకుంటున్న అల్లు అర్జున్ కూతురు!

Allu Arha: క‌రోనా మ‌హ‌మ్మారి చేస్తున్న మాయ‌లు అన్నీ ఇన్నీ కావు. వైర‌స్ వ‌ల‌న ఎప్పుడు లేనిది వ‌ర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులు, ఓటీటీల హ‌వా ఇలా ఒక‌టేంటి చాలా వింత‌లు చూస్తున్నాం. క‌రోనా వ‌ల‌న గ‌త రెండేళ్లుగా పిల్ల‌లు స్కూల్స్‌కి వెళ్ల‌డ‌మే మానేశారు. స్కూల్‌లో పాఠాల‌తో పాటు డ్యాన్స్‌, సంగీతం అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే న‌డుస్తున్నాయి. బ‌న్నీ కూతురు అర్హ కూడా ఆన్‌లైన్‌లోనే పాఠాలు నేర్చుకుంటుంది.

Allu Arha

ఖాళీ స‌మ‌యంలో సంగీతంతో పాటు శ్లోకాలు ఆన్‌లైన్‌లో నేర్చుకుంటుంది. ట్యాబ్ ముందు పెట్టుకొని ఎంతో ప‌ద్ద‌తిగా శ్లోకాలు నేర్చుకుంటుంది. ఈ చిన్నారి ఆస‌క్తిని చూసి నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చ‌దువు, సంగీతం, డ్యాన్స్, న‌ట‌న‌ తో పాటు ఆన్‌లైన్‌లో శ్లోకాలు నేర్చుకుంటున్న అర్హ‌ని చూసి సెల‌బ్స్ సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

అక్కినేని సమంత… డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్‏లో వస్తున్న శాకుంతలం సినిమాతో అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విష‌యం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‏గా అర్హ.. ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. గుణటీం వర్క్స్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇందులో దుశ్యంతుడి పాత్రలో మళయాలం స్టార్ దేవ్ మోహన్ నటించనున్నారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్హ లిటిల్ భరతుడిగా కనిపించబోతుంది.

అల్లు వారి నాల్గో తరం కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారంటూ బన్నీ ఎమోషనల్ అవుతూ అర్హ ఎంట్రీని క‌న్‌ఫాం చేసిన విష‌యం తెలిసిందే. సెట్‌లో సమంత సైతం అర్హను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తన డైలాగ్స్, సీన్స్ విషయంలో అర్హను సమంత బాగా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అర్హ ఫ‌స్ట్ టేక్ అయిన త‌ర్వాత స‌మంత త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శంసిస్తూ కామెంట్స్ చేసింది. అర్హ అదరగొట్టేసింది. ఆమెకు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా అదిరిపోతాయ్.. సూపర్‌గా ఉన్నాయి.. అని సమంత చెప్పుకొచ్చారు. అయితే అర్హ తండ్రి స‌మంత‌తో జ‌త క‌ట్టి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌గా, ఇప్పుడు అర్హ సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

Team India: కృనాల్ నుండి మ‌రో ఇద్ద‌రు క్రికెట‌ర్స్‌కి సోకిన క‌రోనా..!

Team India: వ‌న్డే సిరీస్ గెలిచి మంచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా తొలి టీ 20లోను విజ‌యం సాధించింది. ఇక రెండో టీ20కి కొద్ది గంటల ముందు కృనాల్ పాండ్యాకి క‌రోనా పాజిటివ్ అని తేలియ‌డంతో ఏకంగా మ్యాచ్‌ని ర‌ద్దు చేశారు. ఇక త‌ర్వాతి మ్యాచ్‌ల‌కు భారత స్క్వాడ్ లో కేవ‌లం న‌లుగురు బ్యాట్స్‌మెన్ మాత్ర‌మే బ‌రిలోకి దిగారు. అయితే చివ‌రి రెండు టీ 20ల్లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం చెందిన విష‌యం తెలిసిందే.

TEAM INDIA

కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన త‌ర్వాత ఇప్పుడు భారత క్రికెటర్లు చాహల్,కృష్ణప్ప గౌతమ్ లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా కృనాల్ పాండ్యతో పాటుగా మరో ఆరుగురు క్రికెటర్లు ఇసోలేష‌న్‌ లో ఉన్న విషయం విదితమే. తాజాగాఇద్దరు క్రికెట‌ర్స్ కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల అనంతరం నెగెటివ్‌ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ కోసం వీరు ప్రాక్టీస్ చేయ‌నున్నారు.

క‌రోనా సోకిన కృనాల్‌కి కాంటాక్ట్ అయిన వారిలో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండడంతో టీమిండియాపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. కృనాల్ చేసిన ప‌ని వ‌ల‌న భార‌త్ రెండు టీ 20ల‌లో దారుణ‌మైన ప‌రాభ‌వం చ‌వి చూసింది.ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలో బీభత్సమైన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లాల్సిన పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ ప్రోటోకాల్ ప్ర‌కారం ప‌ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. నెగెటివ్ రిపోర్ట్ వ‌స్తే వారు ఇంగ్లండ్ టూర్‌కి వెళ‌తారు. అక్క‌డ కూడా మరో 10 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అంటే 20 రోజుల పాటు ఈ ఇద్దరూ జట్టుకి అందుబాటులో ఉండరు. శ్రీలంక టూర్‌లో కృనాల్ పాండ్యాతో కలవని వారిలో ఉన్న భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ వంటి వాళ్లకి జట్టులో చోటు దక్కవచ్చు అని కూడా అంటున్నారు.

K Raghavendra Rao: న‌టుడిగా మారిన ద‌ర్శ‌కేంద్రుడు.. ఏ సినిమాతోనో తెలుసా?

K Raghavendra Rao: మౌన‌ముని, శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఖుష్బు, శిల్పా శెట్టి, టబు… ఇలా అనేక మంది స్టార్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన విశిష్ట దర్శకుడు ఆఫ్ స్క్రీన్‌లో త‌న మాయాజాలం చూపించాడు.

K Raghavendra Rao

చాన్నాళ్ల‌పాటు రాఘ‌వేంద్ర‌రావు త‌న నోరు విప్ప‌లేదు. ఎలాంటి వేదిక అయిన స‌రే మౌనంగా ఉండే వారు. కాని ఈ మ‌ధ్య ఆయ‌న‌లో దాగి ఉన్న కొత్త టాలెంట్స్‌ని బ‌య‌ట‌కు తీస్తున్నాడు. న‌టుడిగా, హోస్ట్‌గా,నిర్మాత‌గా, స‌మ‌ర్ప‌కుడిగా ఇలా రాఘవేంద్ర‌ర‌రావు ప‌లు ర‌కాల‌లో క‌నిపిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు మెగా ఫోన్ ప‌ట్టుకున్నారు.

గతంలో శ్రీకాంత్ హీరోగా రాఘ‌వేంద్ర‌రావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ, కామెడీ, సంగీతం, ఎమోషన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇంత కాలానికి ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పెళ్లి సంద‌D’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా ద్వారా శ్రీలీలా హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చిన మేక‌ర్స్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. పెళ్లి సంద‌Dలో రాఘవేంద్రరావు విశిష్ట అనే పాత్రలో నటిస్తున్నార‌ని తెలియ‌జేస్తూ, తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు రోషన్‌‌‌‌‌కు తాతగా నటిస్తోన్నారని తెలుస్తోంది. ఈ ప్రోమోలో రాఘవేంద్రరావు సూటు- బూటు వేసుకొని స్టైలిష్‌‌‌‌‌గా కనిపించారు. దర్శకేంద్రుడి శిష్యుడు, దర్శక ధీరుడు… రాజమౌళి ఆ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు.

హీరోయిన్స్‌పై పూలు, పండ్లు వేయిస్తూ క‌నిపించిన రాఘవేంద్ర‌రావు ఇప్పుడు తాను బాస్కెట్‌లోకి బాల్ విసురుతూ స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపించారు. సూటు, బూటు వేసి గాగుల్స్ పెట్టి స్టైలిష్ గా కనిపించాడు. ‘పెళ్లి సందడి’ సినిమా హీరోయిన్ దీప్తి భట్నాగర్ తో పాటూ రాజేంద్రప్రసాద్ ని కూడా మనం వీడియోలో చూడవచ్చు!

Janhvi Kapoor: బాబోయ్..శ్రీదేవి కూతురు ప‌రువాల విందుకు ప‌డిపోకుండా ఉండలేక‌పోతున్నాం!

Janhvi Kapoor: అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ధ‌డ‌ఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా ఈ సినిమా జాన్వీకి నిరాశ మిగిల్చింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ ‘గుంజన్ సక్సేనా’ ఫర్వాలేదు అనిపించింది. ఇది మినహాయించి ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించలేక‌పోతున్న జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.

Janhvi Kapoor

ఆ మ‌ధ్య జాన్వీ సూపర్ హిట్ పాట ‘నాక ముక్కా’కు తన గ్యాంగ్‌తో కలిసి ఆమె చిందులు వేసింది. తన గ్యాంగ్‌కి ‘అక్సా’ గ్యాంగ్ అంటూ ఆమె పేరు పెట్టింది. ఈ గ్యాంగ్ చేసిన సంద‌డికి నెటిజ‌న్స్, ప‌లువురు సెల‌బ్రిటీలు తెగ ఫిదా అయ్యారు. ఇక తరచూ విహార యాత్రలకు వెళుతూ.. అక్కడ హాట్ డ్రెస్‌లు ధరించి జాన్వీ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు.

నిత్యం సోషల్ మీడియాల్లో షేర్ చేసే ఫోటోలు వీడియోలకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న జాన్వీ క‌పూర్ తాజ‌గా బ్లాక్ డ్రెస్‌లో ప‌రువాల విందు చేస్తూ ఫొటో షూట్ చేసింది. జాన్వీ షేర్ చేసిన ఫొటోల‌కు నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

నిత్యం ఫొటోషూట్స్‌తో గుక్క తిప్పుకోకుండా జాన్వీ క‌పూర్ చేస్తుంటే ఇక ఆమె చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా అంత క‌న్నా భారీ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకు తిప్పుకుంటుంది. జాన్వీ క‌న్నా మ‌రింత హాట్ గా ఖుషీ రెచ్చిపోతుంది. త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు మంచి దారి చూపించాల‌ని బోనీ చాలా ఆరాట‌ప‌డుతున్నారు. . ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘తక్త్’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది.

Thimmarusu Review: ‘తిమ్మరుసు’ రివ్యూ : ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌

Thimmarusu Review: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్ల మూడు నెలలుగా మూత పడి ఉన్నాయి. ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు మొదలు అవ్వడంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కరోనా భయం ఇంకా ఉంది. కనుక సినిమా ఖచ్చితంగా చూడదగ్గది అంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి. కనుక ఈ సినిమా మరి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Satyadev Thimmarusu Movie Review Rating
Satyadev Thimmarusu Movie Review Rating

కథ :

ఒక మర్డర్‌ తో కథ మొదలు అవుతుంది. ఆ కేసులో అమాయకుడు అయిన ఒక వ్యక్తిని పోలీసులు ఇరికిస్తారు. నిర్ధోషి అయిన ఆ వ్యక్తి తరపున వాదించేందుకు లాయర్ రామ్‌ (సత్యదేవ్‌) సిద్దం అవుతాడు. ఆ క్రమంలో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అసలు చనిపోయింది ఎవరు.. చంపింది ఎవరు ఎందుకు ఒక అమాయకపు వ్యక్తిని పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తారు.. ఇంతకు లాయర్ రామ్‌ అతడిని ఎలా కాపాడుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

నటుడిగా పరిచయం అయిన సత్యదేవ్‌ ఈ సినిమాలో మరోసారి ది బెస్ట్‌ ఇచ్చాడు. హీరో అనడం కంటే నటుడిగా మంచి ప్రతిభ కనబర్చాడు అనడంలో సందేహం లేదు. లాయర్‌ గా మంచి నటనతో సినిమా స్థాయిని పెంచాడు అనడంలో సందేహం లేదు. ఇక బ్రహ్మాజీ ఎప్పటిలాగే మంచి సపోర్టింగ్‌ రోల్‌ లో నటించడంతో పాటు నవ్వించాడు. ఇక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌ కు నటించడానికి పెద్దగా స్కోప్‌ దక్కలేదు. అయితే ఉన్నంతలో ఆకట్టుకుంది. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

Satyadev Thimmarusu Movie Review Rating
Satyadev Thimmarusu Movie Review Rating

టెక్నీషియన్స్‌ :

సినిమాను దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఆకట్టుకనే విధంగా తెరకెక్కించాడు. స్క్రీన్‌ ప్లే మొదలుకుని డైలాగ్స్ వరకు అన్ని విషయాల్లో కూడా అతడి యొక్క ప్రతిభ కనిపించింది. కథ కోసం కాస్త ఎక్కువగానే రీసెర్చ్‌ చేసినట్లుగా ఉన్నారు. అందుకే ఎక్కడ ఎలాంటి లూప్‌ హోల్స్ లేవు. ఇక సినిమాటోగ్రాఫర్ కూడా సింపుల్‌ గా సహజ సిద్దంగా పాత్రలను మరియు సన్నివేశాలను చూపించేందుకు సహాయ పడ్డాడు. సంగీతం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మినహా బాగానే ఉంది.

విశ్లేషణ :

నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు చాలా కాలం వెయిట్‌ చేసిన సత్యదేవ్‌ కు వచ్చిన ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు అతడు మంచి నటనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో అద్బుతమైన నటనను కనబర్చిన సత్యదేవ్‌ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మరోసారి సత్యదేవ్‌ ఆకట్టుకున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన మొదటి సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాకు ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును కొనసాగించేందుకు అన్నట్లుగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ప్రేక్షకులకు బోర్‌ ఫీల్ కలుగకుండా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా సినిమా ఉంది. కనుక ఈ సినిమా ను చూసేందుకు జనాలు థియేటర్లకు రావచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • సత్యదేవ్ నటన,
  • కథలో ట్విస్ట్‌,
  • బ్రహ్మాజీ,
  • నిడివి ఎక్కువ లేకపోవడం

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్‌ హాఫ్‌ లో కొన్ని సన్నివేశాలు
  • సత్యదేవ్‌, బ్రహ్మాజీ కాకుండా స్టార్స్ పెద్దగా లేకపోవడం

చివరగా: చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా.. చూడదగ్గ సినిమా.

రేటింగ్‌ : 3/5

Rupee Coin: ఆశ్చ‌ర్యం: రూపాయి కాయిన్‌ని కోటి రూపాయ‌ల‌కి విక్ర‌యం

Rupee Coin: ఈ మ‌ధ్య కాలంలో పాత నాణేల‌కి భ‌లే డిమాండ్ పెరిగింది. గ‌తంలో ఉన్న ఐదు, ప‌ది, ప‌దేహ‌ను , ఇర‌వై, ఇర‌వై ఐదు, యాభై పైస‌ల నాణేల‌కి ఇప్పుడు గిరాకీ బాగుంది. పాత నాణేల కోసం ఒక్కొక్క‌రు ఒక్కో ఆఫ‌ర్ ఇస్తున్నారు.ఈ మ‌ధ్య ఓ రెస్టారెంట్ వ్య‌క్తి ఐదు పైస‌ల నాణేలు తీసుకొస్తే బిర్యానీ ఇస్తాన‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు ఐదు పైస‌ల నాణేలు ప‌ట్టుకొని ఎంత పెద్ద క్యూలు క‌ట్టారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక పాత‌రూ. 2, రూ. 5, రూ.10, 25 పైసల కాయిన్స్‌ను భారీ మొత్తంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌లో విక్రయించడం చూసే ఉంటారు. పాత నాణేల ద్వారా చాలా మంది భారీ మొత్తంలో న‌గ‌దు సంపాదిస్తున్నారు. అయితే పాత త‌రాల‌కు చెందిన విలువైన వ‌స్తువులని విక్ర‌యించి వాటిని జాగ్ర‌త్త‌గా పొందుప‌ర‌చ‌డం కొంద‌రికి హాబీగా ఉంటుంది. పాత వ‌స్తువుల కోసం వారు ఎంతైన ఖ‌ర్చు పెడుతుంటారు.

తాజాగా 1885 సంవత్సరానికి చెందిన రూ.1 కాయిన్‌ను కోటి రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కాయిన్‌ ప్రత్యేకత ఏమిటంటే..ఈ కాయిన్‌పై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్‌ కింగ్‌ జార్జ్‌-5 చిత్రం కాయిన్‌ ఉన్న అరుదైన కాయిన్‌కు ఆన్‌లైన్‌లో కోటి రూపాయాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అరుదైన కాయిన్స్‌ను ఎక్కువగా ఇండియా మార్ట్‌లో విక్రయించడం గమనించవచ్చు. ఇప్పుడు 1885 సంవ‌త్స‌రానికి చెందిన కాయిన్‌ని కూడా ఇండియా మార్ట్‌లోని కొనుగోలు దారుల‌తో చ‌ర్చించి భారీ మొత్తంలో న‌గ‌దు పొంద‌వచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాయిన్‌ ఉంటే ఇండియామార్ట్‌లో రిజిస్టరై కొనుగోలుదారులతో చర్చించి భారీ మొత్తాన్ని పొందవచ్చును.

అరుదైన కాయిన్స్‌ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్‌ అని పిలుస్తారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి అధ్యయనం చేస్తారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా పాత కాయిన్స్ తీసుకెళ్లి ఇండియా మార్ట్‌లో ఇచ్చి మంచి అవ‌కాశాన్ని పొంద‌వ‌చ్చు.

GOA CM: ఇద్ద‌రు బాలిక‌ల‌పై అత్యాచారం.. వారికి బీచ్‌లో ఏం ప‌ని అంటూ సీఎం కామెంట్స్

GOA CM: గోవాలోని ఒక బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గోవా రాజధాని పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలోని కోల్వా బీచ్‌కు ఇద్దరు మగపిల్లలతో కలసి ఇద్దరు మైనర్ బాలికలు వెళ్లగా తాము పోలీసులమంటూ నలుగురు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ ఇద్దరు మగపిల్లలను చితకబాది ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

న‌లుగురిలో వ్య‌వ‌సాయ శాఖ‌లో డ్రైవ‌ర్‌గా పని చేస్తున్న ప్ర‌భుత్వ‌వ ఉద్యోగి ఒక‌డు ఉన్నాడు. ఆ ఉద్యోగిని సర్వీను నుంచి డిస్మిస్ చేసే ప్రక్రియ సాగుతుండ‌గా, న‌లుగురు నిందితుల‌ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే దీనిపై గోవాలో పెద్ద ఎత్తున ర‌చ్చ న‌డుస్తుంది. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుండ‌గా, విప‌క్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి.

ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో తాజాగా మాట్లాడిన ఆయ‌న అర్ధ‌రాత్రి ఆడ‌పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు ఎందుకు పంపాలి, బీచ్‌లో వారికి ఆ స‌మ‌యంలో ఏం ప‌ని? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా? వారి బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదని అని సీఎం సావంత్‌ తీవ్రంగా స్పందించారు.

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఆడ‌వారిని కించ‌ప‌రిచేలా ఉన్నాయని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. దీనిపై వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. మ‌రి దీనిపై సీఎం ఏమైన స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, జూలై 24వ తేదీన రాజధాని పనాజీకి 30 కిలో మీటర్ల దూరంలోని కోల్వా బీచ్‌లో పార్టీ జ‌ర‌గ‌గా, దీనికి 10 మంది టీనేజర్లు హాజరయ్యారు. పార్టీ ముగిశాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లిపోగా.. ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు రాత్రంగా బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో దారుణం జ‌రిగింది.

Jabardasth: వ‌చ్చే వారం జ‌బ‌ర్ధ‌స్త్‌ని అస్స‌లు మిస్ కావొద్దు.. న‌వ్వులే న‌వ్వులు..!

Jabardasth: క‌రోనా వ‌ల‌న చాలా మంది డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు. అంద‌రి జీవితాలు అస్త‌వ్య‌స్థంగా మార‌డంతో జీవితం ఎటు పోతుందో తెలియ‌క సందిగ్ధంలో ప‌డిపోయారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేది లేక పిచ్చోళ్లులా మారిపోతున్నారు. ఈ స‌మయంలో ప్ర‌తి ఒక్క‌రిని క‌డుపుబ్బ న‌వ్విస్తూ హ్యాపీగా ఉంచుతుంది పాపులర్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌.

టీం లీడ‌ర్స్ మారిన‌, అందులోని స‌భ్యులు మారిన‌, జ‌డ్జిలు చేంజ్ అయిన జ‌బ‌ర్ధ‌స్త్ షో అంతే స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. వారం వారానికి మాంచి మ‌సాలాని జోడిస్తూ టీం స‌భ్యులు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌తి గురువారం, శుక్ర‌వారాలు న‌వ్వుల పండ‌గే. ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి.

ప్ర‌తి వారం రానున్న ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమోలు విడుద‌ల చేస్తూ ఆ ఎపిసోడ్‌పై ఆస‌క్తిని పెంచుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా వ‌చ్చేవారం ఎపిసోడ్‌కి సంబంధించి చిన్న ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో పంచ్‌లు, సెటైర్స్,సంపూర్ణేష్ భారీ డైలాగ్స్ ఉన్నాయి. ఈ ప్రోమో చూస్తుంటే వచ్చే వారం జబర్దస్త్‌ని మాత్రం అసలు మిస్ కాకుడదనేలా అనిపిస్తుంది.

హైప‌ర్ ఆది త‌న టీంలోకి గెస్ట్‌గా వ‌చ్చిన యాంక‌ర్ విష్ణుప్రియ‌తో చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆమె ముక్కుపై సెటైర్స్ వేస్తూ అద‌ర‌గొట్టాడు. ఇక ఫ‌న్‌టాస్టిక్ ఫ‌న్‌తో అదిరే అభి టీం అద‌ర‌గొట్టింది. ఫ్రస్టేషన్ విత్ ఫన్‌తో రాకెట్ రాఘవ టీం అలరించారు. స్పెషల్ గెటప్‌లో వచ్చిన చంటి అందరిని అబ్బురపరిచాడు. ఎనర్జిటిక్ ఎంటర్‌టైన్మెంట్‌తో వెంకీ మంకీస్ టీం ఆకట్టుకున్నారు.

ఈ ఎపిసోడ్‌కి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు క్యాలీఫ‌వ‌ర్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు వ‌చ్చాడు. ప్రోమో చివ‌రలో సంపూ క్యాలిఫ‌వ‌ర్ గొప్ప త‌నం గురించి చెబుతూ భారీ డైలాగ్ విసిరాడు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

Babu Mohan: మా లో చీడ పురుగులు.. బాబు మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Babu Mohan: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఐదుగురు అధ్యక్ష ప‌దవికి పోటీ చేయ‌బోతున్నారు. ముందుగా ప్ర‌కాశ్ రాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నట్టు ప్ర‌క‌టించ‌గా, ఆ త‌ర్వాత మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహారావు పోటీలో నిలుస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే మా ఇష్యూస్‌పై ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు ప‌లు విధాలుగా స్పందిస్తున్నారు.

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో కొన్ని చీడ పురుగులు చేరి చెడగొడుతున్నాయని అన్నారు నటుడు బాబూ మోహన్. టాలీవుడ్‌లో మా ఎన్నిక‌లు వివాదాస్పదంగా మారడంతో ఆయ‌న ఈ హాట్ కామెంట్స్ చేశారు. ‘మా’ అంటే మా కుటుంబం అని ఇందులో జరిగే వాటిని ఎన్నికలుగా చూడమని చెప్పిన ఆయన.. కావాలనే కొంతమంది ‘మా’ని వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

‘మా’ ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది.. నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ ఎన్నికలు పదిరోజుల హడావిడి మాత్రమే. అయితే ఆ మధ్య ‘మా’ అనేది బాగా వివాదం అవుతుంది. అది కొందరివల్ల మాత్రమే. చెడగొట్టే ఛీడపురుగులు అన్ని చోట్లా ఉంటాయి. అన్ని వృత్తులలోనూ ఈ ఛీడ పురుగులు ఉంటాయి.. అలాగే ‘మా’ వృత్తికి కూడా దాపరించింది. మా ఎల‌క్షన్స్‌ని త‌ప్ప‌క జ‌రిపించాలి. దీనిని మేం ఎల‌క్ష‌న్స్‌గా భావించం. ఇంటి ఎన్నిక‌లుగా మాత్ర‌మే చూస్తాం.

బ్ర‌ద‌ర్ లేదా సిస్ట‌ర్‌కి ఓటు వేస్తున్నాం అని భావిస్తాం. మా అనేది ఒక ఫ్యామిలీ. పొలిటికల్ స్టంట్లు ఏమీ ఉండవు. కాని కొంద‌రు మాలోకి దూరి చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిరంజీవి, దాసరి లాంటి పెద్దలు ‘మా’ చెడగొట్టకుండా కాపాడారు. కానీ చీడ పురుగు తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు అని బాబు మోహ‌న్ పేర్కొన్నారు.

Recent News