Vimanam Movie Review : విమానం మూవీ రివ్యూ..!
NQ Staff - June 9, 2023 / 12:17 PM IST

Vimanam Movie Review : గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న సినిమా పేరు విమానం. ఇందులో అనసూయ వేశ్య పాత్రలో నటిస్తోందనే టాక్ రావడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, అనసూయ, ధన్ రాజ్, రాహుల్ రామకృష్ణ, మీరా జాస్మిన్ నటించారు. దర్శకుడు శివప్రసాద్ యానాల రూపొందించిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది మరి ఎలా ఉందో చూద్దాం.
కథ..
వీరయ్య(సముద్రఖని) పబ్లిక్ టాయిలెట్ నడుపుతూ ఉంటాడు. ఆయన పుట్టుక నుంచే వికలాంగుడు. కాగా ఆయనకు రాజు(మాస్టర్ ధృవన్) అనే కొడుకు ఉన్నాడు. రాజుకు ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ఆశ ఉంటుంది. ఈ క్రమంలోనే కొడుకు గురించి ఓ భయంకరమైన వార్త తండ్రికి తెలుస్తుంది. అసలు హృదయ విదారకర వార్త ఏంటి.. దానికి మిగతా పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి, చివరకు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమాలోని మిగతా కథ.
ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్..
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సముద్ర ఖని నటన. ఒక వికలాంగుడిగా కొడుకు గురించి ఆయన పడే ఆరాటం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అన్ని భావోద్వేగాలను సరైన రీతిలో ఆవిష్కరించాడు. ఈ సినిమాలో తొలిసారి ఆయన్ను తెలుగు ప్రేక్షకులు పాజిటివ్ క్యారెక్టర్ లో చూస్తారని చెప్పుకోవచ్చు. రాజు పాత్రలో మాస్టర్ ధృవన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో చాలా బాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే నటించింది. మీరా జాస్మిన్, ధన్ రాజ్, రాహుల్ రామకృష్ణతో సహా మిగిలిన సహాయ తారాగణం బాగుంది.
టెక్నికల్ గా ఎలా ఉంది..
ఇది తండ్రీకొడుకుల సింపుల్ కథ. విపత్కర పరిస్థితుల్లో తన కొడుకు కోరికను తీర్చేందుకు తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా. ఇక సినిమా చివరలో ట్విస్ట్ ఇవ్వడం దర్శకుడి పనితనాన్ని గుర్తు చేస్తోంది. కాకపోతే అక్కడక్కడ సాగదీత ఎక్కువగా ఉంది. ఒక్కోసారి కథ అస్సలు ముందుకు సాగడం లేదనిపిస్తుంది. పైగా క్లైమాక్స్ ను ఇంటర్వెల్ లోనే బాగా అర్థం చేసుకునేలా క్లియర్ గా చెప్పేస్తారు. దాంతో అసలు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి పోతోంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది.

Vimanam Movie Review
ప్లస్ పాయింట్స్..
నటీనటుల నటన
కొన్ని ఎమోషనల్ సీన్స్..
మైనస్ పాయింట్స్..
ఊహించదగిన కథ
సీన్ల సాగదీత
రొటీన్ స్క్రీన్ ప్లే
తీర్పు: మొత్తం మీద విమానం మంచి ఎమోషనల్ సీన్స్ తో ఉంది. కానీ ఇవన్నీ మనం ముందే ఊహించేయవచ్చు. అంత రొటీన్ గా ఉంది. ఈ సినిమాలో పాయింట్ హృదయాన్ని హత్తుకునేదే అయినా తిప్పి తిప్పి చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అందుకే సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. పని పాటా లేకపోతేనే ఈ సినిమాకు వెళ్లవచ్చు.
రేటింగ్: 2.25/5