Thiru Movie Review : తిరు మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామా

NQ Staff - August 18, 2022 / 03:43 PM IST

Thiru Movie Review  : తిరు మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామా

Thiru Movie Review  : కోలీవుడ్ హీరో ధ‌నుష్ సినిమాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఈ హీరోకి తమిళంలోనే కాకుండా తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను గ్లోబర్ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే వాటికి తగ్గ కథలు మాత్రం ఇప్పుడు ఎంచుకున్నట్టు కనిపించడం లేదు. ఆయన నటించిన చిత్రాలు అంతగా మెప్పించడం లేదు. చివరగా కర్ణన్ సినిమాతోనే ధనుష్ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తిరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

క‌థ‌:

తిరు ఏకాంబరం అలియాస్ పండు (ధనుష్) తన తండ్రి(ప్రకాష్ రాజ్)తో పదేళ్లు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉంటాడు. తన తల్లి, చెల్లి చావుకు తండ్రే కారణమని ద్వేషిస్తుంటాడు తిరు. సీనియర్ పండు అలియాస్ సీనియర్ తిరు ఏకాంబరం (భారతీ రాజా) ఈ ఇద్దరికీ వారధిలా ఉంటాడు. తన తాత కోసమే తిరు ఇంట్లో ఉంటాడు. ఇక చిన్ననాటి స్నేహితురాలు శోభన (నిత్యా మీనన్) తిరుకు అన్ని విషయాల్లో తోడుంటుంంది. తిరు మధ్యలోనే చదువు మానేయడంతో చిరవకు డెలివరీ బాయ్‌లా సెటిల్ అవుతాడు. చిన్నతనంలో స్కూల్‌లో అనూష (రాశీ ఖన్నా) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. మళ్లీ ఓ సంఘటనతో అనూషను కలుస్తాడు. అనూష తిరస్కరిస్తుంది. ఆ తరువాత రంజినీ (ప్రియా భవానీ శంకర్)ను తిరు ఇష్టపడుతాడు. కానీ ఆమె కూడా అలాంటి సమాధానమే చెబుతుంది. చివరకు తిరు ఎవ‌ర‌కు ప్రేమ‌లో ప‌డ‌తాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

న‌టీన‌టుల పర్‌ఫార్మెన్స్

Thiru Movie Review

Thiru Movie Review

తిరు పాత్రలో ధనుష్ చక్కగా నటించాడు. భావోద్వేగాలు పలికించడంలో ధనుష్ శైలి ప్రత్యేకం. భారతీ రాజా అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. తన పాత్రతో సినిమాలో ఎక్కడా బోర్ కొట్టించకుండా చేశాడు భారతీ రాజా. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. నిత్యా మీనన్ నటనకు వంక పెట్టడానికి ఏం లేదు. రాశీ ఖన్నా గ్లామర్ డోస్ బాగానే ఉంది. ప్రియా భవానీ ఉన్నది కొద్ది సేపే అయినా చక్కగా నటించింది. అందంగా కనిపించింది. మిగిలిన పాత్రల్లో అందరూ మెప్పించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

సాంకేతికపరంగా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంగీతం, కెమెరాపనితనం అన్నీ ఓకే అనిపిస్తాయి. నిడివి తక్కువే ఉన్నా కూడా.. థియేటర్లో ఎక్కువ సేపు ఉన్న ఫీలింగ్ వస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అనిరుధ్ అయితే రఘువరన్ బ్యాక్ గ్రౌండ్‌నే వాడేశాడా? అన్నట్టుగా అనుమానం వస్తుంది. ఇక తిరు సినిమాలో కథ, కథనం కొత్తగా ఏమీ అనిపించదు. . కొన్ని స‌న్నివేశాలు ఒకటి రెండు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ తమిళ్ నేటివిటీయే ఎక్కువగా కనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్:
ధ‌నుష్‌, నిత్యామీన‌న్
మిడిల్ క్లాస్ సెటప్
మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్

Thiru Movie Review

Thiru Movie Review

తెలిసిన క‌ధ‌
ఊహించ‌ద‌గిన సెకండాఫ్‌

విశ్లేష‌ణ‌:

ఈ చిత్రంలో కొత్త కథ ఏమి లేదు. ఆహా అనిపించే ట్విస్టులేమీ ఉండవు. విజిల్స్ వేసే యాక్షన్ సీన్స్ ఉండవు. క్లీన్ అండ్ నీట్‌గా సాగుతూ ఉంటుంది. మనం ఏదో మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. కావాలని ఏదో ఇరికించాలని ఎక్కడా కూడా హీరోయిజాన్ని పెట్టలేదు. సాధారణ కథను, ప్రేమను, ఎమోషన్స్‌ను గుండెకు హత్తుకునేలా చేశారు.

                                                              రేటింగ్‌: 2.25/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us