The Warrior Movie Review : ది వారియ‌ర్ మూవీ రివ్యూ

NQ Staff - July 14, 2022 / 03:25 PM IST

The Warrior Movie Review : ది వారియ‌ర్ మూవీ రివ్యూ

The Warrior Movie Review : ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని న‌టించిన సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత రామ్ న‌టించి సినిమాల‌న్నీ ఫ్లాప్ కావ‌డంతో ది వారియ‌ర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. రామ్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఇందులో ఆమె పాత్ర రేడియో జాకీ. ఇప్పటికే హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీ తో తన టాలెంట్ నిరూపించుకున్నారు. మళ్లీ అదే తరహాలో యాక్షన్ త్రిల్లింగ్ తో ది వారియర్ మూవీ థియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా క‌థ ఎలా ఉందో చూద్దాం.

The Warrior Movie Review

The Warrior Movie Review

క‌థ‌: కర్నూలులో గురు (ఆది పినిశెట్టి) తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఎదురన్నది లేకుండా రౌడీయిజం చేస్తుంటాడు.అక్కడి జనాలు గురు భయంతోనే బతుకుతుంటారు. అలాంటి ఊర్లోకి డాక్టర్ సత్య (రామ్ పోతినేని) వస్తాడు. గురు ప్రాణాలు తీస్తుంటే.. డాక్టర్ సత్య ప్రాణాలు పోస్తుంటాడు. అయితే డాక్టర్ సత్య తనకు పదే పదే అడ్డు నిలుస్తున్నాడని ప్రాణాలు తీయబోతాడు గురు. చివరి క్షణంలో డాక్టర్ సత్య ప్రాణాలతో బయటపడతాడు. డీఎస్పీగా సత్య చార్జ్ తీసుకున్న తరువాత ఏం జరిగింది? గురు ఆటను ఎలా కట్టించాడు? ఈ కథలో విజిల్ మహాలక్ష్మీ (కృతి శెట్టి) పాత్ర ఏంటి? అసలు చివరకు ఏమైంది? అనేది

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

The Warrior Movie Review

The Warrior Movie Review

డాక్టర్‌గా, పోలీస్‌గా సత్య పాత్రలో రామ్ అదరగొట్టేశాడు. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అందరినీ మరోసారి మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మరింత స్టైలీష్‌గా కనిపించాడు. డాక్టర్ గెటప్ కంటే.. పోలీస్ లుక్కులోనే రామ్ కొత్తగా కనిపిస్తాడు. ఆ పాత్ర ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విజిల్ మహాలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి ఎంతో క్యూట్‌గా, బబ్లీగా కనిపించింది. మరోసారి ఆడియెన్స్‌ను తన లుక్స్‌తో కట్టిపడేస్తుంది. ఇక ఆదికి విలనిజంతో అల‌రించాడు.నదియా, బ్రహ్మాజీ వంటి వారు సినిమాలో మంచి పాత్రలను పోషించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

The Warrior Movie Review

The Warrior Movie Review

రొటీన్ కమర్షియల్ సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ఓ ఊర్లో రౌడీ, జనాలంతా కూడా భయపడుతుంటారు.. ఆటలు, పాటలు కూడా ఉంటాయి. ఇది కూడా అంతే. పక్కా అదే ఫార్మూలానే పాటిస్తూ వెళ్లారు. లింగుసామీ టేకింగ్ స్టైలీష్‌గా అనిపిస్తుంది. తెర అంతా ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కానీ కథనంలో మాత్రం ఎక్కడా కొత్తదనం కనిపించదు. డీఎస్పీ ఇచ్చిన రెండు పాటలు, అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్‌గా అనిపిస్తాయి. మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చేలానే ఉంది. కెమెరాపనితనం చక్కగా కుదిరింది. ఎడిటింగ్‌లో ఎన్నో సీన్లకు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

The Warrior Movie Review

The Warrior Movie Review

రామ్, ఆది పినిశెట్టి
సెకండాఫ్‌లో కొన్ని సీన్స్
టూ సాంగ్స్

మైన‌స్ పాయింట్స్:

రెగ్యుల‌ర్ న‌రేష‌న్
యాక్ష‌న్ సీన్స్

విశ్లేష‌ణ:

The Warrior Movie Review

The Warrior Movie Review

ది వారియర్ అనేది రొటీన్ కాప్ డ్రామా, ఇందులో ప్రధాన నటులు మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. పోలీస్ పాత్రలో రామ్ ఓకే కాగా, ఆది పినిశెట్టి తన వంతు పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా చేశాడు. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ సెంటర్స్ లో డీసెంట్ గా పర్ఫామెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రొటీన్ ప‌రంగా కొన్ని స‌న్నివేశాలు ఉండ‌డంతో ఈ చిత్రంలో కొత్త ద‌నం ఏమి లేద‌ని అంటున్నారు. మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చేలానే ఉంది. ఎడిటింగ్ సీన్‌లో చాలా సీన్ల‌కి క‌త్తెర ప‌డాల్సి ఉంది.

 

                రేటింగ్ : 2.0

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us