The Ghost Review: ది ఘోస్ట్ మూవీ రివ్యూ: ‘ది ఘోస్ట్’.. ఇంపాక్ట్ సరిపోలేదు.!

NQ Staff - October 5, 2022 / 12:13 PM IST

The Ghost Review: ది ఘోస్ట్ మూవీ రివ్యూ: ‘ది ఘోస్ట్’.. ఇంపాక్ట్ సరిపోలేదు.!

The Ghost Review: కింగ్ అక్కినేని నాగార్జున, యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడంటే బజ్ గట్టిగానే ఏర్పడుతుంది. పైగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా కావడంతో అంచనాలు ఇంకా పెరిగాయ్. ఓ చేత్తో గన్, ఇంకో చేత్తో గర్ల్.. అంటూ సినిమా ప్రమోషన్లలో సరదాగా వ్యాఖ్యానించిన అక్కినేని నాగార్జున, సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు. ప్రోమోస్ బాగానే ఆకట్టుకున్నాయ్. దాంతో దసరా రేసులో ‘ది ఘోస్ట్’ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.. అనే ఇంపాక్ట్ విడుదలకు ముందు ఆడియన్స్‌లో పడింది. ఇంతకీ ‘ది ఘోస్ట్’ కథ కమామిషు ఏంటో తెలుసా..? తెలుసుకుందాం పదండిక..

కథ

విక్రమ్ ఓ ఇంటర్‌పోల్ అధికారి. ఓ మిషన్ ఫెయిల్ అవడంతో, సైలెంటయిపోతాడు. హై ప్రొఫైల్ కుటుంబానికి బాడీగార్డుగా మళ్ళీ తెరపైకొస్తాడు. ఆ కుటుంబంలోని ఓ అమ్మాయికి ప్రాణహాని వుంటుంది. ఆమెను ఎవరు చంపాలని చూస్తున్నారు.? హీరో మాత్రమే ఆమెను రక్షించేందుకు ఎందుకు ప్రత్యేకంగా నియమించబడ్డాడు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు..

కింగ్ అక్కినేని నాగార్జున గురించి కొత్తగా చెప్పేదేముంది.? దర్శకుడు ఎలా చెబితే అలా తనను తాను మలచుకున్నాడు. ఫిట్నెస్ విషయంలో కావొచ్చు, యాక్షన్ థ్రిల్లర్‌కి అవసరమైన బాడీ లాంగ్వేజ్ కావొచ్చు.. అన్నిట్లోనూ నాగ్ ది బెస్ట్ అనిపించాడు.

హీరోయిన్ సోనాల్ చౌహన్ నుంచి చాలా ఆశిస్తాం. అలా ఆమె పాత్రను పరిచయం చేశారుగానీ, ఆ తర్వాత ఆమె ఆ పాత్ర కోసం కొత్తగా చేయడానికేమీ లేకపోయింది. అనికా సురేంద్రన్ ఓకే, బాగానే చేసింది. మిగతా పాత్రధారుల్లో చాలావరకు వృధా అయ్యాయనే చెప్పాలి.. విలన్ పాత్ర సహా.

సాంకేతిక నిపుణులెలా పని చేశారంటే..

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది. మాటలు బావున్నాయ్. యాక్షన్ థ్రిల్లర్స్‌కి క్రిస్పీ ఎడిటింగ్ అవసరం. చాలా చోట్ల అది లోపించింది. స్టంట్స్ కొన్ని బావున్నాయ్, కొన్ని పేలవంగా మారాయ్.

ప్లస్ పాయింట్స్…

  • అక్కినేని నాగార్జున
  • కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్..

  • సాగతీత
  • విలనిజం తేలిపోవడం
  • టాలెంట్ వున్న నటులు తెరపై ఏమీ చేయలేకపోవడం..

విశ్లేషణ..

నిజానికి, సినిమాకి మంచి స్టార్ కాస్టింగ్ కుదిరింది. పెర్ఫామ్ చేయగల నటులున్నా, దర్శకుడు వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగా డిజైన్ చేసినా, కొన్నిటి విషయంలో తేలిపోయారు. ఎమోషన్ సరిగ్గా పండలేదు. యాక్షన్ బ్లాక్స్‌కి తగిన ప్లాట్‌ఫామ్ కథ, కథనాల పరంగా క్రియేట్ చేయలేకపోయారు. మంచి అవకాశాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు వృధా చేసుకున్నాడనిపిస్తుంది. నాగార్జున పెట్టిన ఎఫర్ట్‌కి ప్రవీణ్ సత్తారు ఇంకా బెటర్ ఔట్‌పుట్ తెచ్చి వుండాల్సింది.

రేటింగ్: 2/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us