Takkar Movie Review : టక్కర్ మూవీ రివ్యూ.. సిద్దార్థ్ హిట్ కొట్టాడా..?
NQ Staff - June 9, 2023 / 09:40 AM IST

Takkar Movie Review : హీరో సిద్దార్థ్ ఒకప్పుడు తన నోటి దురుసు వల్ల తెలుగులో అవకాశాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన టక్కర్ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటించింది. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
ఒక మధ్య తరగతి కుర్రాడు అయిన సిద్దార్థ్ డబ్బులు సంపాదించి ఎలాగైనా ధనవంతుడు కావాలనే ఆశతో చెన్నైకి వెళ్తాడు. అక్కడ రూటు మార్చి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అతను ఎంచుకున్న రూట్ వల్ల అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది, చివరకు అతను సమస్యల నుంచి బయట పడ్డాడా లేదా అనేది మిగతా కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఈ సినిమాకు మెయిన్ గా ప్లస్ కావాల్సింది సిద్దార్థ్ నటన. కానీ ఇందులో అదే మైనస్ గా అయిపోయింది. ఈ సినిమాలో సిద్దార్థ్ నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఏదో చేశామా అంటే చేశాం అన్నట్టే ఉంటుంది. అంతే తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అదే సినిమాకు పెద్ద లోటు అయిపోయింది. ఇక దివ్యాంక అంతంత మాత్రంగానే నటించింది. ఇందులో విలన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోదు. మిగతా పాత్ర దారుల నటనకు పెద్దగా స్కోప్ లేదు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
ఈ సినిమాను కార్తీక్ జీ క్రిష్ అయోమయంగా తీశాడని అర్థం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాప్ బెటర్ గా ఉంటుంది. కానీ సెకండ్ హాప్ చిరాకు పుట్టిస్తుంది. అసలు ఇందులో ఏముంది అనేలా సీన్లను రాసుకున్నాడు దర్శకుడు. చెప్పాల్సింది పక్కకు పెట్టేసి అనవసర సీన్లను ఇరికించేశాడు. మితిమీరిన రొమాన్స్, అడల్ట్ కంటెంట్ మైనస్ గా మారిపోయింది. విలన్ పాత్ర కన్విన్సింగ్‌గా లేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ లోపాలు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా డల్ గా ఉంది.

Takkar Movie Review
ప్లస్ పాయింట్స్..
ఫస్ట్ హాప్
హీరోయిన్ గ్లామర్
మైనస్ పాయింట్లు..
నటీనటుల పేలవ పర్ఫార్మెన్స్
కథలో బలం లేకపోవడం
సెకండ్ హాప్ బాగాలేదు

Takkar Movie Review
చివరగా..
సిద్దు సినిమాలు అంటే చాలా లవ్లీగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అసలు ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు కథను పక్కకు పెట్టేసి అనవసర సీన్లతో నింపేశారా అనిపిస్తుంది. సినిమా అంతా గందరగోళంగా ఉంటుంది. ఇది ఏ వర్గాలను కూడా ఆకట్టుకోదనే చెప్పుకోవాలి. కేవలం సిద్దార్థ్ ఫ్యాన్ అయితేనే వెళ్లండి.
రేటింగ్ః2/5