Sardar Movie Review : ‘సర్దార్’ రివ్యూ: నేటివిటీ మిస్సయినా కార్తీ అదరగొట్టేశాడు.!
NQ Staff - October 21, 2022 / 03:29 PM IST

Sardar Movie Review : కార్తీ మంచి నటుడు. అక్కినేని నాగార్జున చెప్పినట్లు, స్టార్ హీరో సూర్య తమ్ముుడిలా కాకుండా.. విలక్షణ నటుడు కార్తీగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. ‘ఖైదీ’ సినిమాలో కార్తీ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ తరహా యాక్షన్ బ్లాక్స్, ఆ సినిమాని మించిన కంటెంట్.. అంటూ ‘సర్దార్’ సినిమా గురించిన ప్రచారం జరిగింది. ఇంతకీ, ఈ స్పై థ్రిల్లర్ కథ, కమామిషు ఎలా వుంది.? ఆలస్యమెందుకు పదండి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం..
కథేంటంటే..
విజయ్ ప్రకాష్ ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. డిపార్టుమెంటులో అందరికంటే భిన్నంగా వ్యవహరించి, పాపులర్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఓ ఫైల్ మిస్ అయితే, దానికోసం వెతుకుతున్న సీబీఐ మరియు రా ఏజెన్సీ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాడు విజయ్.
ఆ కేసు విజయ్ చేతికి వస్తుందా.? ఇంతకీ, సర్దార్ ఎవరు.? మిస్ అయిన ఫైల్‌లో వున్న దేశ సైనిక రహస్యాలేంటి.? రాత్రికి రాత్రి దేశమంతా తన గురించి చర్చించుకునేంత పాపులారిటీ రావాలనుకునే విజయ్ ఏం చేశాడు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
నటుడిగా కార్తీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సరైన పాత్ర దొరికితే పవర్ హౌస్.! ఈసారి డబుల్ రోల్‌లో కార్తీ సత్తా చాటాడు. సర్దార్ పాత్రలో, విజయ్ పాత్రలో భిన్నమైన షేడ్స్ చూపించాడు. నటుడిగా కార్తీలోని కొత్త కోణం కనిపిస్తుంది.

Sardar Movie Review
రాశి ఖన్నా లాయర్ పాత్రలో జస్ట్ ఓకే అనిపిస్తుంది. రాజిషా విజయన్, చుంకీ పాండే, మురళీ శర్మ, సిమ్రాన్ తదితరులు తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు.
యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా సెట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొన్ని సాధారణ సన్నివేశాల్ని కూడా వేరే లెవల్‌కి తీసుకెళ్ళేలా వుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగానే వున్నా, సెకెండాఫ్‌లో కత్తెర పదును కాస్త తగ్గిందనిపిస్తుంది. ఖర్చు విషయంలో ఎక్కడా ారజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
కార్తీ నటన
యాక్షన్ ఘట్టాలు
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్..
తెలుగు నేటివిటీకి దూరంగా వుంది..
రెండో అర్థభాగంలో సాగతీతగా వున్న కొన్ని సన్నివేశాలు
విశ్లేషణ

Sardar Movie Review
కథ, కథనాల విషయంలో దర్శకుడ్ని అభినందించి తీరాల్సిందే. రేసీ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడి దృష్టిని స్క్రీన్ మీద నుంచి కదలనివ్వలేదు దర్శకుడు. అయితే, ఫస్టాఫ్‌లో వున్న జోరు సెకెండాఫ్‌లో కాస్త తగ్గిందనిపిస్తుంది. తెలుగు నేటివిటీకి దూరంగా వుండడమొక్కటీ, తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఓ సమస్య. దాన్ని పక్కన పెడితే, ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ని తెరపై ఎంజాయ్ చేయొచ్చు.
కార్తీ కోసం, యాక్షన్ ఘట్టాల కోసం రిపీటెడ్‌గా సినిమా చూస్తారేమో ఓ వర్గం ప్రేక్షకులు. సెకెండాఫ్‌లో వేగం తగ్గకుండా వుండి వుంటే, వంకలు పెట్టడానికి కూడా ఏమీ వుండేది కాదేమో.!
రేటింగ్ 2.75/5